జనవరి 17న Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం

Highlights

  • కొత్త సంవత్సరం 2024 లో లాంచ్ కానున్న S24 సిరీస్
  • లైనప్ లో రానున్న S24, S24+, S24 Ultra
  • తాజాగా రివీలైన ప్రీ-ఆర్డర్ మరియు సేల్ తేదీ

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung కొత్త సంవత్సరం 2024 లో Samsung Galaxy S24 సిరీస్ ని లాంచ్ చేసే అవకాశం ఉంది. Samsung Galaxy S24 లైనప్ లో మొత్తం 3 ఫోన్లు రానున్నాయి. అవి: Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus, Samsung Galaxy S24 Ultra. తాజాగా వెలువడిన నివేదిక ప్రకారం, 2024 జనవరి 17 వ తేదీన శాంసంగ్ వెబ్‌సైట్ లో Samsung Galaxy S24 సిరీస్ కి సంబంధించిన అన్ని వివరాలు పొందుపరచనున్నట్లు సమాచారం. సరే, ఓసారి Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ తేదీ, ప్రీ-ఆర్డర్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ తేదీ

  • రిపోర్ట్ ప్రకారం, Samsung Galaxy S24 సిరీస్ 2024 జనవరి 17 న లాంచ్ కానుంది.
  • లాంచైన రోజు నుంచే అన్ని స్మార్ట్‌ఫోన్ల ప్రీ-ఆర్డర్స్ కూడా మొదలవుతాయని తెలుస్తోంది.
  • ప్రీ-ఆర్డర్ చేసుకున్న యూజర్లకు 2024 జనవరి 26 నుంచి 30 వ తేదీ మధ్యలో ఫోన్లు డెలివరీ అవుతాయని రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.
  • జనవరి 30 నుంచి Samsung Galaxy S24 సిరీస్ యొక్క ఓపెన్ సేల్ మొదలవుతుందని సమాచారం.
  • అయితే Samsung Galaxy S24 సిరీస్ కి సంబంధించిన అధికార ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Samsung Galaxy S24 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy S24 వేరియంట్ 6.1-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ప్లస్ వేరియంట్ 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, అల్ట్రా మోడల్ 6.8-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటాయి. టాప్ మోడల్ అల్ట్రా 2,200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ప్రాసెసర్: Samsung Galaxy S24 మరియు Samsung Galaxy S24+ డివైజెస్ ఎగ్జినోస్ 2400 చిప్సెట్ తో వస్తున్నాయి. ఇకపోతే అల్ట్రా మోడల్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ తో వస్తోంది.
  • కెమెరా: Samsung Galaxy S24 Ultra లో 200ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 10ఎంపి పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి. స్టాండర్డ్ మరియు ప్లస్ వేరియంట్స్ లో 50ఎంపి ప్రైమరీ లెన్స్ ఉంటుంది. ఈ మూడు ఫోన్లలో కూడా 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy S24 లో 4,900 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉంటాయి. ప్లస్ వేరియంట్ లో 4,900 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉంటాయి. అల్ట్రా మోడల్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy S24 సిరీస్ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • కనెక్టివిటీ: Samsung Galaxy S24 సిరీస్ లో వస్తోన్న డివైజెస్ లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ వంటి ఆప్షన్స్ ఉంటాయి.