
బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించారు కథానాయకుడు ప్రభాస్. ఆ సినిమాల పరంపర యంగ్ రెబెల్ స్టార్ ని నేషనల్ స్టార్ గా చేసింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 1, 2 చిత్రాలు ప్రభాస్ ని జనాల హృదయాల్లో నిలిచేలా చేసాయి. తన నటన, హావభావాలతో ప్రభాస్ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఇక ఆ సినిమాల మొదలు వరుసబెట్టి ప్యాన్ ఇండియా చిత్రాలనే చేస్తున్నారు ప్రభాస్. తాజాగా ఈ సాహో నటుడు ఆదిపురుష్ అనే మరొక ప్యాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు, యావత్ ప్రేక్షకలోకం ఆదిపురుష్ చిత్రం కోసం ఎదురు చూస్తోంది. రామాయణ గాథ ఆధారంగా ఆదిపురుష్ సినిమా రూపొందింది. ఆదిపురుష్ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలవుతోంది. ఇక ఓటీటీల్లో కూడా ప్రభాస్ నటించిన సినిమాలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. వివిధ ఓటీటీ వేదికల్లో ప్రభాస్ చిత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆర్టికల్ లో అమెజాన్ ప్రైమ్ వీడియో లో అందుబాటులో ఉన్న ప్రభాస్ చిత్రాల జాబితాను తెలుసుకుందాం.
Amazon Prime Video లో ప్రభాస్ సినిమాలు
1. రాధేశ్యామ్
2. సాహో
3. మిర్చి
4. రెబెల్
5. బుజ్జిగాడు
6. యోగి
7. రాఘవేంద్ర
1. Radhe Shyam
రాధేశ్యామ్ చిత్రం 2022 లో దేశ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. థియేటర్లో ఈ చిత్రాన్ని చూడకపోతే ఓసారి చూసేయండి. ఇప్పటికే చూసి ఉంటే, మరొకసారి మీ ఫ్యామిలీతో కలిసి వీక్షించండి.
- థియెటర్ రిలీజ్: మార్చి 11, 2022
- ఐఎండిబి రేటింగ్: 5.3/10
- నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే
- ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో
2. Saaho
సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ప్యాన్ ఇండియా సినిమా సాహో. ఈ చిత్రంలో ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో పై అందుబాటులో ఉంది. చూసి ఆనందించండి.
- థియేటర్ రిలీజ్: ఆగస్టు 30, 2019
- ఐఎండిబి రేటింగ్: 5/10
- నటీనటులు: ప్రభాస్, శ్రద్ధా కపూర్
- ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో
3. Mirchi
మిర్చి సినిమాలో ప్రభాస్, అనుష్క శెట్టి, రిచా గంగోపాధ్యాయ ప్రధాన పాత్రలు పోషించారు. కొరటాల శివ దర్శకత్వం వహించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో కి సబ్‌స్క్రైబ్ అయి ఈ సినిమాని చూడండి.
- థియెటర్ రిలీజ్: ఫిబ్రవరి 8, 2013
- ఐఎండిబి రేటింగ్: 7.3/10
- నటీనటులు: ప్రభాస్, అనుష్క శెట్టి
- ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో
4. Rebel
2012 లో రెబెల్ చిత్రం విడుదలైంది. ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. రెబెల్ లో ప్రభాస్ తో పాటు తమన్నా, దీక్షా సేఠ్ నటించారు. సీనియర్ నటుడు కృష్ణంరాజు ముఖ్యపాత్ర పోషించారు. ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ సంగీతం కూడా సమకూర్చారు. అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ చిత్రాన్ని చూడండి.
- థియెటర్ రిలీజ్: సెప్టెంబర్ 28, 2012
- ఐఎండిబి రేటింగ్: 4.8/10
- నటీనటులు: ప్రభాస్, తమన్నా
- ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో
5. Yogi
2004 లో యోగి చిత్రం విడుదలైంది. ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహించారు. ప్రభాస్, నయనతార ఈ చిత్రంలో జంటగా నటించారు. ప్రభాస్ తల్లిగా కీలక పాత్రలో సీనియర్ నటి శారద నటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. మీరు గనుక ఈ సినిమాని చూడకపోతే అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ తీసుకుని చూసేయండి.
- థియేటర్ రిలీజ్: జనవరి 10, 2007
- ఐఎండిబి రేటింగ్: 4.5/10
- నటీనటులు: ప్రభాస్, నయనతార
- ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో
6. Bujjigadu
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన బుజ్జిగాడు చిత్రం ప్రభాస్ ని విభిన్నశైలిలో ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటుంది. ప్రభాస్ సరసన త్రిష ఈ చిత్రంలో నటించింది. సీనియర్ నటుడు మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించారు.
- థియెటర్ రిలీజ్: మే 22, 2008
- ఐఎండిబి రేటింగ్: 6.3/10
- నటీనటులు: ప్రభాస్, త్రిష
- ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో
7. Raghavendra
2003 లో రాఘవేంద్ర చిత్రం విడుదలైంది. ప్రభాస్, అన్శు, శ్వేతా అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషించారు. మురళీ మోహన్, ప్రభ, ఆనంద్ రాజ్ సహాయక పాత్రలో కనిపించారు. సురేశ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ చిత్రాన్ని చూసి ఆనందించండి.
- థియెటర్ రిలీజ్: మార్చి 23, 2023
- ఐఎండిబి రేటింగ్: 4.8/10
- నటీనటులు: ప్రభాస్, అన్శు
- ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో