హైలైట్స్:
- జులై 14 న విడుదలై థియేటర్లలో సందడి చేసిన ‘ది వారియర్’
- చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన రామ్, కృతిశెట్టి. సంగీతం సమకూర్చిన దేవి శ్రీ ప్రసాద్
- దర్శకత్వం వహించిన లింగుసామి, విలన్ పాత్రలో మెప్పించిన ఆది పినిశెట్టి
ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన ‘ది వారియర్’ చిత్రం ఇటీవలె థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను అలరించింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. ఎన్ లింగుసామి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా యొక్క అఫీషియల్ ఓటీటీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా హక్కుల్ని దిగ్గజ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ కైవసం చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రం ఆగస్టు 11 నుంచి ది వారియర్ స్ట్రీమ్ కానున్నట్లు డిస్నీ+ హాట్‌స్టార్ వెల్లడించింది. కృతిశెట్టి ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు.
He is ready! ?#TheWarriorr arrives on @DisneyPlusHSTel this August 11.#TheWarriorrOnHotstar @ramsayz @AadhiOfficial @dirlingusamy @iamkrithishetty @SS_Screens @srinivasaaoffl @ThisIsDSP @anbariv @DisneyPlusHS pic.twitter.com/HXzCxvz1Hl
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) July 31, 2022
చిత్ర నటీనటులు:
ది వారియర్ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పథాకం పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మించారు. కథను అందించిన ఎన్ లింగుసామి చిత్ర దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తించారు. రామ్ పోతినేని, ఆది పినిశెట్టి, కృతిశెట్టి, అక్షర గౌడ, నదియ తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. సుజిత్ వాసుదేవ్ కెమెరామెన్ గా పని చేయగా, నవీన్ నూలి ఎడిటింగ్ చేశాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు.
చిత్ర కథ:
కర్నూలు నగరంలో డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సత్య అనే పోలీసు అధికారి, స్థానిక గూండా గురుని ఎలా ఎదుర్కున్నాడన్నదే చిత్ర ప్రధాన కథ. అయితే ఈ చిత్రంలో హీరో ఒక డాక్టర్, కానీ వ్యవస్థను బాగు చేసేందుకు పోలీసుగా మారతాడు. కథలో విలన్ పాత్ర పోషించిన ఆది పినిశెట్టి, మర్డర్ చేసిన ప్రతిసారి ఒక మొక్క నాటుతుంటాడు. సినిమాలో ఇదొక రకం ఆకర్షణ. ఇక కథానాయిక కృతిశెట్టి రేడియో జాకీ గా చేసింది. విజయ్ మహాలక్ష్మి పాత్రలో కృతి మెప్పించింది. అక్షర గౌడ, నదియా తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఇప్పుడు సినిమా సంగీతం గురించి తెలుసుకుందాం. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూగించాయి. ముఖ్యంగా విజిల్, బుల్లెట్ పాటలు సినిమాలో హైలైట్ అని చెప్పాలి. ఇక సంభాషణలు రాసిన సాయి మాధవ్ బుర్రా తనదైన శైలి డైలాగ్స్ తో ఫర్వాలేదనిపించారు.
హీరో రామ్ కి పోలీసు పాత్ర చేయడానికి చాలా ఏళ్ళు పట్టింది. ఎప్పటి నుంచో పోలీసుగా చేయాలని అనుకున్న రామ్ కి ఈ పాత్ర భలే దొరికింది. సినిమాలో రామ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇటు డాక్టర్, అటు పోలీసు గా రెండు షేడ్స్ ని రామ్ బాగా పండించాడు. రామ్ నటనకు ఆయన ఫ్యాన్స్ ఫిదా అవ్వడం ఖాయం.
ఇక దర్శకుడు లింగుసామి హిస్టరీ చూస్తే.. రన్, పందెంకోడి, ఆవారా వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. లింగుసామి చిత్రాల్లో మాస్ అంశాలు చాలా పుష్కలంగా ఉంటాయనడంలో సందేహం అక్కర్లేదు. ఇప్పుడు రామ్ తో తీసిన ది వారియర్ కూడా చక్కటి మాస్ అంశాలను కలిగి ఉంది. చిత్రంలో హీరో, విలన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
డిస్నీ+ ప్లస్ హాట్ స్టార్ లో ఆగస్టు 11 న ప్రసారం కానున్న ‘ది వారియర్’ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయండి.












