లాంచ్ కి ముందు రివీల్ అయిన Realme 10 చిప్సెట్, కెమెరా, బ్యాటరీ స్పెసిఫికేషన్స్

హైలైట్స్

  • లాంచ్ కి ముందు ప్రధాన స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసిన రియల్మీ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేఠ్
  • మీడియాటెక్ హీలియో జీ99 చిప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న Realme 10
  • 2022, నవంబర్ 9 న లాంచ్ అవుతోన్న Realme 10 స్మార్ట్ ఫోన్

Realme 10 లైనప్ ని లాంచ్ చేసేందుకు రియల్మీ సంస్థ సిద్దంగా ఉంది. భారత్ తో పాటు చైనా, యూరోప్ తదితర మార్కెట్స్ లో ఈ ఫోన్ విడుదల కానుంది. ఈ లైనప్ లో మొత్తం 3 మోడల్స్ ఉండనున్నాయి. అవి: Realme 10, Realme 10 Pro 5G, Realme 10 Pro+ 5G. గతంలో మాదిరి ఈ సిరీస్ ని కూడా ప్లాన్ చేస్తే గనుక, వీటికి తోడు మరిన్ని మోడల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రియల్మీ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేఠ్ Realme 10 యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ని వెల్లడించారు.

అధికారికంగా వెల్లడైన Realme 10 ముఖ్యమైన స్పెసిఫికేషన్స్

 

GSMArena కి ఇచ్చిన ఇంటర్వ్యూలో Realme 10 కి సంబంధించిన పలు వివరాలను మాధవ్ సేఠ్ వెల్లడించారు. Realme 10 మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్, 16జిబి డైనమిక్ ర్యామ్ (8జిబి ర్యామ్ + 8జిబి వర్చువల్ ర్యామ్), 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తోందని మాధవ్ సేఠ్ తెలిపారు.

గత మోడల్ అయిన Realme 9 లో 108ఎంపి మెయిన్ కెమెరా ఉంది. కానీ, Realme 10 లో ఉండే 50 మెగా పిక్సెల్ కెమెరా చక్కటి పనితనాన్ని ప్రదర్శిస్తుందని మాధవ్ అన్నారు. Realme 10 డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయని మాధవ్ వెల్లడించారు. గేమింగ్ తో సహా, ఫోన్ ని హెవీ యూజ్ చేసినా బ్యాటరీ పూర్తిగా ఒక రోజు మొత్తం వస్తుందని తెలుస్తోంది. 28 నిమిషాల్లో Realme 10 ఫోన్ 0% నుండి 50% వరకు చార్జ్ అవుతుందని మాధవ్ చెప్పారు.

Realme 10 స్పెసిఫికేషన్స్ (అంచనా)

Realme 10 స్మార్ట్ ఫోన్ 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ ని ఇందులో అమర్చారు. పవర్ బ్యాకప్ కోసం Realme 10 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు Realme 10 కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Realme 10 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ సెకండరీ లెన్స్ ఉంటాయి. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్మీ యూఐ 3.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. Realme 10 159.9 మిల్లీ మీటర్ల పొడవు, 73.3 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.95 మిల్లీ మీటర్ల మందం, 178 గ్రాముల బరువు ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.