MediaTek Dimensity 700 చిప్, 50MP కెమెరాతో లాంచ్ అయిన TCL 40R 5G

హైలైట్స్

  • ఐరోపా మార్కెట్ లో లాంచ్ అయిన కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ TCL 40R
  • 4జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్, 50ఎంపి కెమెరా ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
  • TCL 40R 5G స్మార్ట్ ఫోన్ ధర 240 యూరోలు (సుమారు రూ.19,000)

ఫోన్ లేదా మరేదైనా గ్యాడ్జెట్ టెక్నాలజీ ప్రపంచంలోకి అడుగు పెట్టిందంటే అందరి కళ్ళు అటువైపే చూస్తాయి. తాజాగా TCL కంపెనీ TCL 40R 5G అనే స్మార్ట్ ఫోన్ ని టెక్ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ 5జీ ఫోన్ ప్రస్తుతం ఐరోపా మార్కెట్ లో లాంచ్ అయ్యింది. TCL 40R 5G స్మార్ట్ ఫోన్ 50ఎంపి కెమెరా, 4జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది.

TCL 40R 5G స్పెసిఫికేషన్స్

TCL 40R 5G స్మార్ట్ ఫోన్ 20:9 యాస్పెక్ట్ రేషియోతో వచ్చింది. ఈ ఫోన్ 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1612 పిక్సెల్ రెజుల్యూషన్ ని కలిగి ఉంది. ఈ మొబైల్ ఫోన్ స్క్రీన్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ తో తయారైంది. ఈ డిస్ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ని కలిగి ఉంది. అలాగే ఇది 269 పిక్సెల్ పర్ ఇంచ్ డెన్సిటీ, 1500:1 కాంట్రాస్ట్ రేషియో, 400 నిట్స్ బ్రైట్నెస్ ని కలిగి ఉంది.

TCL 40R 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. TCL 40R 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్ ని అమర్చారు. ఈ చిప్ 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంది. ఇదొక ఆక్టాకోర్ ప్రాసెసర్. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో ఏఆర్ఎం జీ57 ఎంసీ2 జీపీయూ ని వాడారు.

TCL 40R 5G యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. TCL 40R 5G లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

TCL 40R 5G డ్యూయల్ సిమ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉంది. ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్, వైఫై వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ని అందించారు. పవర్ బ్యాకప్ కోసం TCL 40R 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. TCL 40R 5G ఫోన్ 164.46 మిల్లీ మీటర్ల పొడవు, 75.4 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.99 మిల్లీ మీటర్ల మందం, 192 గ్రాముల బరువు ఉంటుంది.

TCL 40R 5G ధర

TCL 40R 5G స్మార్ట్ ఫోన్ సింగిల్ ర్యామ్ వేరియంట్ లో కేవలం యురోపియన్ మార్కెట్ లో మాత్రమే లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ లో 4జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ ఉన్నాయి. TCL 40R 5G ధర 240 యూరోలు (సుమారు రూ.19,000) గా ఉంది. ఈ ఫోన్ స్టార్ డస్ట్ పర్పుల్, స్టార్ లైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.