లీకైన Realme 10 రెండర్స్, స్పెసిఫికేషన్స్

హైలైట్స్

  • రెండర్స్ ద్వారా లీకైన Realme 10 ఫీచర్లు, డ్యూయల్ కెమెరాస్, పింక్, గ్రే కలర్ ఆప్షన్స్ లో వస్తున్న హ్యాండ్సెట్
  • 6.4-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ Realme 10 లో ఉండే అవకాశం
  • వచ్చే నెల చైనాలో Realme 10 లాంచ్ అవుతుందని అంచనా

OnLeaks తో కలిసి 91mobiles మీ ముందుకు Realme 10 రెండర్స్ మరియు స్పెసిఫికేషన్స్ ని ఎక్స్‌క్లూజివ్ గా తీసుకొచ్చింది. Realme 10 నవంబర్ లో ఎంట్రీ ఇవ్వబోతోంది. దీంతో లాంచ్ కి ముందు కీలక స్పెసిఫికేషన్స్ మనకు తెలిసినట్లైంది. డ్యూయల్ కెమెరాలు, గ్లాసీ ఫినిషింగ్ తో కూడిన బ్యాక్ ప్యానెల్, రెండు కలర్ ఆప్షన్స్ తో Realme 10 వస్తోంది. కొత్త లైనప్ చైనాతో పాటు భారత్ లో నవంబర్ మొదటి వారంలో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. Realme 10 సిరీస్ లో Realme 10 5G, Realme 10 Pro మోడల్స్ ఉండనున్నాయి.

రెండర్స్ ని చూస్తే, Realme 10 పింక్, గ్రే కలర్ ఆప్షన్స్ లో కనిపిస్తోంది. బ్యాక్ ప్యానెల్ పై రియల్మీ లోగోని కూడా గమనించవచ్చు. ఇకపోతే లీక్‌స్టర్ ద్వారా కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చాయి. Realme 10 అమోలెడ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

Realme 10 డిజైన్

Realme 10 రెండర్స్ ఫోన్ యొక్క రియర్ ప్యానెల్ ని చూపిస్తున్నాయి. ఫ్లాట్ ఎడ్జెస్, రియల్మీ లోగో, గ్లాసీ ఫినిషింగ్, పాలి కార్బొనేట్ బాడీ మనకు కనిపిస్తోంది. అలాగే డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెపరేట్ రింగ్స్ లో రెండు కెమెరాలు ఉన్నాయి. 50ఎంపి ఏఐ కెమెరా అని మాడ్యూల్ పై రాసి ఉంది. వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి. Realme 10 బ్లాక్, పింక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుందని రెండర్ ఇమేజెస్ ద్వారా తెలుస్తోంది.

Realme 10 స్పెసిఫికేషన్స్

ఆన్‌లీక్స్ ప్రకారం, Realme 10 6.4-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. Realme 10 మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ ని కలిగి ఉంటుందని సమాచారం. ఓ పోస్టర్ ఇమేజ్ ద్వారా ఈ చిప్సెట్ వివరాలు తెలిశాయి. ఇకపోతే Realme 10 లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉండనుంది. ఎక్స్‌పాండబుల్ మెమొరీ సౌకర్యం ఈ ఫోన్ లో ఉండనుంది.

Realme 10 కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Realme 10 లో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉండనుంది. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు సమాచారం. Realme 10 లో 4జీ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. Realme 10 లాంచ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ హ్యాండ్సెట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleనవంబర్ లో లాంచ్ కానున్న Vivo V25 4G స్మార్ట్ ఫోన్
Next articleలాంచ్ కి ముందు లీకైన Vivo X90 స్పెసిఫికేషన్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.