
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలోనే రెండు మిడ్-రేంజ్ 5జీ ఫోన్లను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. అవే Realme 11 5G మరియు Realme 11x 5G. ఈ రెండు ఫోన్ల లాంచ్ కోసం రియల్మీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ఫోన్లు ఏయే స్పెసిఫికేషన్స్ తో వస్తున్నాయో తెలుసుకునేందుకు వారు ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకోసమే మేం ఈ ఆర్టికల్ లో Realme 11 5G, Realme 11x 5G ఫోన్ల నుంచి ఏం ఆశించవచ్చో తెలియజేస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.
100MP కెమెరా హైలైట్ గా వస్తోన్న Realme 11 5G
- స్మార్ట్ ఫోన్ కొంటున్నామంటే దాదాపుగా అందరూ చూసేది కెమెరా ఎలా ఉందనే. ఫోన్ కెమెరా బాగుంటే ఆల్‌మోస్ట్ ఆ ఫోన్ సక్సెస్ అయినట్లే. అందుకే మొబైల్ ఫోన్ కంపెనీలు కెమెరా విభాగంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటారు.
- ఇక Realme 11 5G విషయానికి వస్తే, ఈ ఫోన్ 100 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో రానున్నట్లు సమాచారం. ఇది శాంసంగ్ ఐసోసెల్ ఎచ్ఎమ్6 ప్రైమరీ సెన్సర్ తో వస్తోంది. ఇక మెయిన్ కెమెరాకు తోడు ఒక సెకండరీ పొట్రెయిట్ లెన్స్ ఉండనుంది.
67 వాట్ ఫాస్ట్ చార్జింగ్
- Realme 11 5G లో మరొక హైలైట్ గా 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని చెప్పుకోవచ్చు.
- 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వస్తోన్న ఈ ఫోన్ ని త్వరగా చార్జ్ చేయడానికి ఈ ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీ బాగా ఉపయోగపడుతుంది.
వర్చువల్ ర్యామ్ ఫీచర్
- Realme 11 5G లో వర్చువల్ ర్యామ్ ఫీచర్ అందిస్తున్నారు. దీని ద్వారా ర్యామ్ ని పెంచుకునే అవకాశం ఉంటుంది. అంటే ఫిజికల్ ర్యామ్ 8జిబి కాకుండా, మరొక 8జిబి ర్యామ్ ని వర్చువల్ గా పెంచుకోవచ్చు.
- దీంతో యూజర్ కి 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. ఇది సూపర్బ్ ఫీచర్ అని చెప్పవచ్చు.
చిప్సెట్
- Realme 11 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ ఉంటుంది.
- ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్.
- ఈ చిప్ కి ఏఆర్ఎమ్ జీ57 జీపీయూ గ్రాఫిక్స్ ని జత చేసారు.
డిస్ప్లే
- Realme 11 5G లో డిస్ప్లే విభాగం కూడా ఎంతో మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది.
- ఈ డివైజ్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటాయి.
ఓఎస్
Realme 11 5G లో లేటెస్ట్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ని అందిస్తున్నారు. రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ ఫోన్ లో ఉంటుంది.
Realme 11x 5G నుంచి ఏం ఆశించవచ్చు?
Realme 11x 5G స్మార్ట్ ఫోన్ త్వరలోనే భారత్ లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ కి సంబంధించిన పలు విషయాలు ఇప్పటికే లీక్ అయ్యాయి. వాటి ఆధారంగా ఈ ఫోన్ లో హైలైట్స్ ఏంటో తెలుసుకుందాం.
33 వాట్ ఫాస్ట్ చార్జింగ్
- Realme 11x 5G లో 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని అందిస్తున్నట్లు సమాచారం.
- బడ్జెట్ లో చక్కటి ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్ ఉండాలని అందరు యూజర్లు కోరుకుంటారు. వారి ఆలోచనకు తగినట్లుగా ఈ 5జీ ఫోన్ లో 33 వాట్ చార్జింగ్ స్పీడ్ అందిస్తున్నారు.
డిస్ప్లే
- Realme 11x 5G డివైజ్ ఫ్లాట్ ఫ్రేమ్, డిస్ప్లే తో వస్తున్నట్లు ఫస్ట్ లుక్ ద్వారా తెలిసింది.
- అలాగే పంచ్ హోల్ కటౌట్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
కలర్ ఆప్షన్స్
- Realme 11x 5G స్మార్ట్ ఫోన్ భారతీయ మార్కెట్ లో మిడ్నైట్ కలర్ ఆప్షన్ లో లాంచ్ కానుందని తెలుస్తోంది.
- ఈ ఫోన్ ధర Realme 11 5G కన్నా తక్కువగా ఉంటుంది. త్వరలోనే Realme 11x 5G కి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.











