Realme 11X 5G: భారత్‌లో లాంచ్‌కి ముందు రివీలైన ఫస్ట్ లుక్

Highlights

  • భారత్ లో ఈ నెలలో Realme 11 5G, 11X 5G లాంచ్ అయ్యే అవకాశం
  • ఈలోపు విడుదలైన Realme 11X 5G ఫస్ట్ లుక్
  • 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోరట్ తో రానున్న డివైజ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలో భారత్ లో Realme 11X 5G ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. తాజాగా Realme 11X 5G డివైజ్ ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. దీంతో ఫోన్ డిజైన్ ఎలా ఉందో తెలిసిపోయింది. ఇమేజ్ ద్వారా ఫోన్ డిస్ప్లే, పంచ్-హోల్ కెమెరా ఉన్నట్లు తెలుస్తోంది. Realme 11X 5G స్మార్ట్ ఫోన్, Realme 11 5G తో పాటు ఈ నెలలోనే లాంచ్ కానుందని సమాచారం.

Realme 11X 5G ఫస్ట్ లుక్

  • ఇండస్ట్రీ వర్గాలు షేర్ చేసిన ఇమేజ్ ప్రకారం, Realme 11X 5G డివైజ్ Realme 11 Pro సిరీస్ కంటే విభిన్నంగా ఉంటుందని తెలుస్తోంది.
  • Realme 11X 5G డివైజ్ ఫ్లాట్ స్క్రీన్, ఫ్రేమ్, ఐఫోన్-మాదిరి డిజైన్ లాంగ్వేజీని కలిగి ఉంది.
  • Realme 11X 5G లో పంచ్-హోల్ కటౌట్, బెజెల్-లెస్ డిస్ప్లే ఉన్నాయి.
  • Realme 11X 5G డివైజ్ మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్ లో లభించనుందని సమాచారం.
  • Realme 11X 5G స్మార్ట్ ఫోన్ గ్లోబల్ గా ఈ నెలలో లాంచైన Realme 11 5G మాదిరి ఉన్నట్లు తెలుస్తోంది. పంచ్-హోల్ డిస్ప్లే, ఫ్లాట్ ఎడ్జెస్, సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఈ రెండు ఫోన్లు కూడా దాదాపుగా ఒకే విధమైన స్పెసిఫికేషన్స్ ని కలిగి ఉంటాయని భావిస్తున్నారు.
  • Realme 11X 5G డివైజ్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుందని 91మొబైల్స్ కి సమాచారం వచ్చింది. అంతకు ముందు 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అంటూ లీక్స్ వచ్చాయి. ఇకపోతే Realme 11X 5G ధర Realme 11 5G కంటే తక్కువగా ఉండనుంది.

రియల్మీ సంస్థ ఈ రెండు ఫోన్ల భారత లాంచ్ కి సంబంధించిన ప్రకటనను ఇంకా చేయాల్సి ఉంది. కానీ, అతి త్వరలోనే లాంచ్ ఉన్నందున మరింత సమాచారం రానున్న రోజుల్లో బయటకు రానుంది. ఇప్పటికే Realme 11 5G
లాంచ్ అధికారికంగా ఖరారైంది. ఓసారి Realme 11 5G స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.