TENAA ద్వారా లీకైన Realme 11 5G డిజైన్

Highlights

  • రియల్మీ 11 ప్రో, రియల్మీ 11 ప్రో+ తో పాటు లాంచ్ కానున్న Realme 11 5G
  • TENAA సర్టిఫికేషన్ వెబ్ సైట్ ద్వారా రివీల్ అయిన Realme 11 5G డిజైన్
  • రీసెంట్ గా బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ లో కనిపించిన సిరీస్

లాంచ్ కి ముందు Realme 11 5G డివైజ్ TENAA సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. లిస్టింగ్ ద్వారా డిజైన్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. గతంలో ప్రో+ మోడల్ కూడా TENAA ద్వారా లీకైంది. అప్పుడు రియల్మీ 11 వంటి రౌండ్ కెమెరా మాడ్యూల్ కనిపించింది. తాజాగా రివీలైన డిజైన్ కాస్త విభిన్నంగా కనిపిస్తోంది. సరే, ఓసారి Realme 11 5G డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

లీకైన Realme 11 5G డిజైన్, స్పెసిఫికేషన్స్

Realme 11 5G ఫ్లాట్ డిస్ప్లే, రౌండెడ్ కార్నర్స్ కలిగి ఉంది. TENAA ఇమేజెస్ ద్వారా ఈ విషయం తెలుస్తోంది. ఇంకా ఫోన్ ముందు భాగాన పైన ఎడమవైపున సెల్ఫీ కెమెరా కోసం పంచ్ హోల్ కటౌట్ కనిపిస్తోంది. ఫోన్ వెనుకాల సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది.

ఇప్పటివరకు హ్యాండ్సెట్ స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు. లీకైన సమచారాన్ని బట్టి Realme 11 5G డివైజ్ 6.4-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే తో రానున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్సెట్ ఉండనుందని సమాచారం. ఇక కెమెరా సెగ్మెంట్ విషయానికి వస్తే, అన్ని సెన్సర్స్ వివరాలు బయటకు రాలేదు. కానీ, 64ఎంపి మెయిన్ కెమెరాతో రానున్నట్లు తెలుస్తోంది. GizmoChina అనే టెక్ వెబ్ సైట్ కథనం ద్వారా డిజైన్, స్పెసిఫికేషన్స్ తెలిసాయి.

Realme 11 సిరీస్ లాంచ్ టైమ్‌లైన్

Realme 11 సిరీస్ వచ్చే నెలలో చైనాలో లాంచ్ అవుతుందని ఖరారైంది. అయితే, కంపెనీ ఇంతవరకు Realme 11 సిరీస్ లాంచ్ తేదీని అఫీషియల్ గా ప్రకటించలేదు. ఒకే సమయంలో భారత్ లో కూడా ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుందని టాక్ వినిపిస్తోంది. ఇక Realme 11 5G విషయానికి వస్తే, ఇది మూడు మోడల్స్ లో బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్ గా నిలవనుందని సమాచారం.

Realme 11 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

రియల్మీ 11 5జీ స్పెసిఫికేషన్స్ పెద్దగా బయటకు రాలేదు. అయితే గత లీక్స్ ద్వారా కొన్ని విషయాలు తెలిసాయి. వాటి ప్రకారం, ఈ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మరో లీక్ ప్రకారం, ఈ డివైజ్ 64ఎంపి మెయిన్ కెమెరాతో రానుందని సమాచారం. ఇంకా రియల్మీ 11 5జీ స్మార్ట్ ఫోన్ 6.4-ఇంచ్ డిస్ప్లే తో వస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి స్పెసిఫికేషన్స్ రానున్న రోజుల్లో రివీల్ అయ్యే అవకాశం ఉంది. రియల్మీ 11 సిరీస్ లో మొత్తం మూడు మోడల్స్ లాంచ్ అవుతాయని తెలుస్తోంది. త్వరలోనే రియల్మీ నుంచి అధికారికంగా ఒక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleఐఫోన్ చార్జర్ నుంచి షాక్ తగిలి బాలుడు మృతి; వివరాలు తెలుసుకోండి!
Next articleరూ.15,000 లోపు ధరలో లభించే 8GB ర్యామ్ ఫోన్లు
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.