
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో నార్డ్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OnePlus Nord N30 SE 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. గ్లోబల్ మార్కెట్స్ లో లాంచైన తర్వాత OnePlus Nord N30 SE 5G ఐరోపా మార్కెట్స్ లో కూడా లాంచ్ కానుంది. Appuals కథనం ద్వారా OnePlus Nord N30 SE 5G యొక్క ఐరోపా మార్కెట్స్ ధర రివీల్ అయ్యింది. పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి.
OnePlus Nord N30 SE 5G ధర (లీక్)
- OnePlus Nord N30 SE 5G స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అవుతోందని Appuals వెల్లడించింది.
- OnePlus Nord N30 SE 5G ధర 229 యూరోలు (సుమారు రూ.20,500) గా ఉంటుందని తెలుస్తోంది. ఇతర మార్కెట్స్ లో ఈ ధరలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.
OnePlus Nord N30 SE 5G స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: OnePlus Nord N30 SE 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఎల్సీడీ ప్యానెల్ ఉంటాయి.
- ప్రాసెసర్: OnePlus Nord N30 SE 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ ఉంటుంది.
- ర్యామ్, స్టోరేజీ: OnePlus Nord N30 SE 5G డివైజ్ 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ తో వస్తుందని సమాచారం.
- కెమెరా: OnePlus Nord N30 SE 5G లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 2ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: OnePlus Nord N30 SE 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: OnePlus Nord N30 SE 5G లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, 5జీ, ఎన్ఎఫ్సీ, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, జీపీఎస్/గ్లొనాస్/బైడూ ఉంటాయి.
- ఇతర ఫీచర్లు: OnePlus Nord N30 SE 5G లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి.











