
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme మార్చి 6న భారత్ లో Realme 12+ 5G ని లాంచ్ చేయనుంది. అయితే అంతకన్నా ముందుగా ఇండోనేషియా మార్కెట్ లో Realme 12+ 5G లాంచ్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, 50ఎంపి సోని ఎల్‌వైటీ600 మెయిన్ సెన్సర్, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో వచ్చింది. సరే, ఓసారి Realme 12+ 5G ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
Realme 12+ 5G ధర, లభ్యత
- Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దీని ధర ఎంతో తెలుసుకుందాం.
- Realme 12+ 5G 8జిబి+256జిబి మోడల్ ధర ఇండోనేషియాలో Rp.41,99,000 (సుమారు రూ.22,200) గా ఉంది.
- Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్ మార్చి 8 వ తేదీ ఇండోనేషియాలో కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.
- Realme 12+ 5G డివైజ్ పయనీర్ గ్రీన్ మరియు నేవిగేటర్ బీజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Realme 12+ 5G స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Realme 12+ 5G లో 6.67-ఇంచ్ ఈ4 అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ (2400*1080 పిక్సెల్స్), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 50,00,000:1 కాంట్రాస్ట్ రేషియో, హెచ్డీఆర్10+, రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ డిస్ప్లే ఉన్నాయి.
- ప్రాసెసర్: Realme 12+ 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, మాలి జీ68 జీపీయూ ఉన్నాయి.
- ర్యామ్, స్టోరేజీ: Realme 12+ 5G డివైజ్ లో 8జిబి ర్యామ్, 8జిబి డైనమిక్ ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.
- సాఫ్ట్‌వేర్: Realme 12+ 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: Realme 12+ 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ 600 మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Realme 12+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Realme 12+ 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ ఉన్నాయి.
- బరువు, చుట్టుకొలత: Realme 12+ 5G డివైజ్ 163 మి.మీ పొడవు, 75.5 మి.మీ వెడల్పు, 7.9 మి.మీ మందం, 190 గ్రాముల బరువు ఉంది.
- ఇతర ఫీచర్లు: Realme 12+ 5G లో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్ సెటప్, హై-రెజ్ ఆడియో, ఐపీ54 స్ప్లాష్ రెసిస్టన్స్ రేటింగ్ ఉన్నాయి.
- కలర్ ఆప్షన్స్: Realme 12+ 5G పయనీర్ గ్రీన్ మరియు నేవిగేటర్ బీజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.











