
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఎఫ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Galaxy F15 5G పేరుతో ఈ ఫోన్ లాంచ్ కానుంది. మార్చి 4న భారత్ లో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతోంది. ఈలోపు డివైజ్ ధర రివీల్ అయ్యింది. అంతేకాదు, ఎఫ్15 5జీ తో పాటు, ఎమ్14 4జీ డివైజ్ ధర కూడా లీక్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy F15 5G ధర
- Samsung Galaxy F15 5G స్మార్ట్‌ఫోన్ ధర ప్రమోషనల్ బ్యానర్ ద్వారా రివీల్ అయ్యింది. ప్రారంభ ధర బ్యానర్ పై రూ.11,xxx అని ఉంది. ఇది రూ.11,999 అయ్యే అవకాశం ఉంది.
- రివీలైన ధర బేస్ వేరియంట్ కాగా, ఇతర వేరియంట్స్ ధరలు ఇంకా రివీల్ కావాల్సి ఉంది.
- Samsung Galaxy F15 5G డివైజ్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
- టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ప్రకారం, Samsung Galaxy F15 5G డివైజ్ 4జిబి+128జిబి మోడల్ ధర రూ.13,499 గా ఉంటుంది.
- Samsung Galaxy F15 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.14,999 గా ఉంటుంది.
- Samsung Galaxy F15 5G కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్ల ద్వారా రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఫోన్ ధర రూ.11,999 కి చేరుతుంది.
Samsung Galaxy M14 4G వేరియంట్ ధర (లీక్)
టిప్‌స్టర్ Samsung Galaxy M14 4G వేరియంట్ ధరను కూడా టిప్‌స్టర్ రివీల్ చేశారు. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.
Samsung Galaxy M14 4G డివైజ్ 4జిబి + 64జిబి వేరియంట్ ధర రూ.9,499 గా ఉంటుందని టిప్‌స్టర్ తెలిపారు.
Samsung Galaxy M14 4G 6జిబి + 128జిబి మోడల్ ధర రూ.12,499 గా ఉంటుందని టిప్‌స్టర్ అంచనా వేశారు.












