
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme గత వారం GT 5 Pro డివైజ్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు Realme 12 సిరీస్ ని లాంచ్ చేసేందుకు రియ్మలీ సంస్థ సిద్ధమవుతోంది. ఈ లైనప్ లో రెండు ఫోన్లు రానున్నాయి. అవి: Realme 12 Pro మరియు Realme 12 Pro+. తాజాగా ఈ ఫోన్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. దీంతో త్వరలోనే ఈ డివైజెస్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అవ్వనున్నాయని తెలుస్తోంది.
బీఐఎస్ పై కనిపించిన Realme 12 సిరీస్

- Realme 12 Pro, Realme 12 Pro+ డివైజెస్ బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై RMX3842, RMX3840 అనే మోడల్ నంబర్లతో లిస్ట్ అయ్యాయి.
- సేమ్ మోడల్ నంబర్ తో Realme 12 Pro+ డివైజ్ ఇండోనేషియాకు చెందిన SDPPI సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించింది.
- Realme 12 సిరీస్ కి సంబంధించి మోడల్ నంబర్స్ తప్పా మరే ఇతర వివరాలు బీఐఎస్ సర్టిఫికేషన్ ద్వారా రివీల్ కాలేదు.
- రియల్మీ ఇంకా Realme 12 సిరీస్ లాంచ్ కి సంబంధించిన అధికార ప్రకటన చేయలేదు.
Realme 12 Pro, Realme 12 Pro+ స్పెసిఫికేషన్స్
- ప్రాసెసర్: Realme 12 Pro సిరీస్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.
- కెమెరా: Realme 12 Pro డివైజ్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్709 2ఎక్స్ టెలీఫోటో లెన్స్ ఉంటుంది. మరోవైపు, Realme 12 Pro+ లో 64ఎంపి ఒమ్నివిజన్ ఒవి64బి పెరిస్కోప్ టెలీఫోటో 3ఎక్స్ లెన్స్ ఉంటుంది.
- Realme 12 సిరీస్ లో సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఇందులో రెండు కెమెరా సెన్సర్స్, ఒక రెక్టాంగ్యులర్ పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి.
- Realme 12 Pro 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ మోడల్ ధర చైనాలో RMB 2,099 (సుమారు రూ.25,000) గా ఉంటుందని సమాచారం.
- Realme 12 లైనప్ 2024 మొదటి త్రైమాసికంలో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. తొలుత చైనాలో తర్వాత భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో ఈ ఫోన్లు లాంచ్ అవుతాయి.











