ప్రస్తుతం భారత్ లో పండుగల సీజన్ నడుస్తోంది. ఈ సమయంలో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఫోన్లపై మంచి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా రియల్మీ కంపెనీ Realme 12x 5G పై రూ.1500 డిస్కౌంట్ ప్రకటించింది. తక్కువ ధరలో చక్కటి 5జీ ఫోన్ కొనాలని భావిస్తోన్న వారికి ఇది సరైన ఆప్షన్ అవ్వచ్చు. ఓసారి ఆఫర్ వివరాలు మరియు రియల్మీ 12ఎక్స్ 5జీ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Realme 12x 5G ఆఫర్లు మరియు ధర
- Realme 12x 5G స్మార్ట్‌ఫోన్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. 6జిబి మరియు 8జిబి మోడల్స్ పై కంపెనీ డిస్కౌంట్ ప్రకటించింది.
- Realme 12x 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ను రూ.1500 తక్కువకే సొంతం చేసుకోవచ్చు. అంటే ఈ ఫోన్ రూ.13,499 కి లభించనుంది. దీని అసలు ధర రూ.14,999 గా ఉంది.
- మీరు గనుక 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ఎంచుకుంటే మీకు రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఈ ఫోన్‌ని మీరు రూ.12,499 కే కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.13,499 గా ఉంది. ఇక, 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ఇంకా కూడా రూ.11,999 ధరతోనే లభిస్తోంది.
- మీరు గనుక ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా Realme 12x 5G డివైజ్ కొంటే, 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.
- ఈ ఆఫర్లతో పాటు, కంపెనీ రూ.8,650 వరకు ఎక్స్చేంజ్ బోనస్ కూడా అందిస్తోంది. అయితే మీ పాత ఫోన్ కండీషన్ పై ఈ విలువ ఆధారపడి ఉంటుంది.
- అంతేకాదు, 3 నుంచి 24 నెలల కాలపరిమితితో ఈఎంఐ ద్వారా Realme 12x 5G స్మార్ట్‌ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.
Realme 12x 5G స్మార్ట్‌ఫోన్ కోరల్ రెడ్, ట్విలైట్ పర్పుల్ మరియు వుడ్‌ల్యాండ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
ఎక్కడ కొనాలి?
రియల్మీ 12ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ పై కొనుగోలు చేయవచ్చు. క్రింద మేం ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే డివైజ్ కొనుగోలు చేయవచ్చు. ఇంకా, ఈ ఫోన్ కంపెనీ వెబ్‌సైట్ పై కూడా లభిస్తుంది. కాకపోతే, లాంచ్ ధరకే కొనాల్సి ఉంటుంది.
Realme 12x 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Realme 12x 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
ప్రాసెసర్: Realme 12x 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, మాలి-జీ57 జీపీయూ వాడారు.
ర్యామ్, స్టోరేజీ: Realme 12x 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
కెమెరా: Realme 12x 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ: Realme 12x 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చింది.
ఓఎస్: Realme 12x 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. రెండు మేజర్ ఓఎస్ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి. అలాగే 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి.
కనెక్టివిటీ: Realme 12x 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: Realme 12x 5G లో ఎయిర్ జెశ్చర్స్ మరియు డైనమిక్ బటన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు, ఇంకా ఈ ఫోన్ లో ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.
