
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో తన తదుపరి నంబర్ సిరీస్ ను లాంచ్ చేయనుంది. Realme 13 5G పేరుతో ఈ సిరీస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ లైనప్ లో Realme 13 5G, Realme 13+ 5G ఫోన్లు వచ్చే వారం భారత్ లో లాంచ్ అవుతాయి. ఓసారి ఇండియా లాంచ్ తేదీ మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
Realme 13 5G ఇండియా లాంచ్ తేదీ
Realme 13 5G సిరీస్ భారత్ లో ఆగస్టు 29వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవ్వనుంది. Realme 13 5G మరియు Realme 13+ 5G స్మార్ట్‌ఫోన్లు ఈ లైనప్ లో రానున్నాయి. సెప్టెంబర్ నెలలో ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ రిటైలర్స్ ద్వారా ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.
రియల్మీ ఇండియా వెబ్‌సైట్ తో పాటు, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ పై ఈ రియల్మీ ఫోన్ల యొక్క మైక్రోసైట్స్ ప్రస్తుతం దర్శనమిస్తున్నాయి.
Realme 13 5G సిరీస్ ధర (అంచనా)
భారత్ లో Realme 13 5G సిరీస్ ధర రూ.15,000 నుంచి రూ.20,000 మధ్య ఉండే అవకాశం ఉంది. గత మోడల్స్ రియల్మీ 12 మరియు రియల్మీ 12+ ఫోన్ల ప్రారంభ ధరలు వరుసగా రూ.16,999 మరియు రూ.20,999 గా ఉన్నాయి.
Realme 13 5G సిరీస్ డిజైన్
Realme 13 5G సిరీస్ ఫోన్ల యొక్క డిజైన్ ను హువావే మేట్ 60 ప్రో స్పూర్తితో రూపొందించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ డిజైన్ రియల్మీ నార్జో 70 ప్రో మాదిరి కూడా కనిపిస్తోంది. బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా బంప్ ఉంటుంది. అలాగే డ్యూయల్ టోన్ ఫినిషింగ్ ఉంటుంది.
Realme 13 5G సిరీస్ స్పెసిఫికేషన్స్ (అఫీషియల్)
Realme 13 5G సిరీస్ ఫోన్లను శక్తివంతమైన చిప్సెట్స్‌తో లాంచ్ చేయబోతున్నట్లు రియల్మీ కంపెనీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ సిరీస్ లో వచ్చే ఒక ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్ తో రానుంది. ఈ చిప్సెట్ తో వస్తోన్న మొదటి ఫోన్ రియల్మీ 13 సిరీస్ కు చెందినదే కానుంది. ఈ చిప్సెట్ 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.
Realme 13 5G సిరీస్ లో కంపెనీ ఎక్స్‌పాండబుల్ ర్యామ్ ఆప్షన్ తో 26జిబి వరకు ర్యామ్ పవర్ అందించనుంది.
పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. అలాగే 80 వాట్ అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఈ సిరీస్ లో అందిస్తున్నారు. 5 నిమిషాలు చార్జ్ చేస్తే గంట పాటు గేమ్ ఆడొచ్చని కంపెనీ చెబుతోంది.
Realme 13 5G స్పెసిఫికేషన్స్ (లీక్)
Realme 13+ 5G చైనా వేరియంట్ టీఈఎన్ఏఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై ఆక్టా-కోర్ చిప్సెట్ తో లిస్ట్ అయ్యింది. ఈ చిప్సెట్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5 గిగాహెర్ట్జ్. రూమర్లను బట్టి, ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయ్యుంటుందని అర్థమవుతోంది.
Realme 13+ 5G డివైజ్ ఇప్పటికే బీఐఎస్, గీక్‌బెంచ్, ఎఫ్‌సీసీ మరియు ఇతర లిస్టింగ్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ కి సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. 12.5ఎంపి ఈఐఎస్ కెమెరా (50ఎంపి), 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది.
గీక్‌బెంచ్ పై Realme 13+ 5G డివైజ్ 6జిబి ర్యామ్, మాలి-జీ615 ఎంసీ2 జీపీయూ తో లిస్ట్ అయ్యింది. సింగిల్-కోర్ టెస్ట్ లో 1043 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2925 పాయింట్లను ఈ ఫోన్ నమోదు చేసింది.
గత లీక్స్ ప్రకారం, Realme 13 5G స్టాండర్డ్ మోడల్ 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ తో రానున్నట్లు తెలుస్తోంది.











