హైలైట్స్:
- ఓటీటీ తేదీని ఖరారు చేసుకున్న సీతారామం సినిమా
- సీతారామం లో ప్రధాన పాత్రలు పోషించిన దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్
- డిజిటల్ రైట్స్ దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో, సెప్టెంబర్ 9 న ప్రీమియర్
సీతారామం ఓటీటీ ప్రీమియర్: అందరూ ఎంతగానో ఎదరు చూస్తోన్న సీతారామం సినిమా ఓటీటీ ప్రీమియర్ అప్డేట్ రానే వచ్చింది. ఈ సినిమా సెప్టెంబర్ 9 న అమెజాన్ ప్రైమ్ వీడియో లో ప్రీమియర్ కానుంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. రశ్మికా మందన్న కీలక పాత్ర పోషించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలైంది.
A tale of love and love letters that stands timeless ?#SitaRamamOnPrime, Sept 9
@dulQuer @mrunal0801 @iamRashmika pic.twitter.com/bRo4fHs26m— prime video IN (@PrimeVideoIN) September 6, 2022
రొమాంటిక్ కథగా వచ్చిన సీతారామం ప్రపంచ వ్యాప్తంగా 2022, ఆగస్టు 5 న విడుదలైంది. రిలీజ్ అయిన అన్ని చోట్లా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది సీతారామం. ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం హిందీ వర్షన్ ఇంకా థియేటర్లలో నడుస్తోంది.
సుమంత్, భూమిక, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రకాశ్ రాజ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈయన స్వరపరిచిన పాటలకు జనాల నుంచి చక్కటి స్పందన వచ్చింది. సీతారామం చిత్రాన్ని స్వప్న సినిమా నిర్మించింది. వైజయంతీ మూవీస్ బ్యానర్ ఈ చిత్రాన్ని సమర్పించింది.
సాంకేతిక వర్గం:
ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. పీఎస్ వినోద్, శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫర్లుగా చేశారు. కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ చేశారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చారు. అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. టెక్నికల్ గా సినిమా చాలా బాగుంది. లొకేషన్స్ రిచ్ గా కనిపిస్తాయి. ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. 1985, 1965 ల కాలాన్ని బాగా చూపించారు. కెమెరా వర్క్, కాస్ట్యూమ్స్ బాగున్నాయి.
సినిమాలో ఏం బాగున్నాయి
మిలిటరీ ఎపిసోడ్స్, క్లైమాక్స్, హీరో హీరోయిన్ల మధ్య నడిచే రొమాంటిక్ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తుంది. దుల్కర్, మృణాళ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. పాటలు క్లాస్ ఆడియన్స్ మెచ్చే విధంగా ఉన్నాయి. ఇంతందం, ఓ సీతా పాటు వినడానికి, చూడటానికి ఎంతో బాగున్నాయి. ఎస్పీ చరణ్ గాత్రం, ఆయన తండ్రి లెజెండరీ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని గుర్తు చేశాయి.
సుమంత్ నెగటివ్ పాత్రలో మెప్పించారు. అతిథి పాత్ర పోషించిన భూమిక, విభిన్న పాత్రలో రశ్మికా మందణ్ణ, పాకిస్తాన్ ఆర్మీ అధికారిగా శరత్ ఖేదేకర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. తరుణ్ భాస్కర్ హైదరాబాదీ యాసతో మాట్లాడుతూ అలరించాడు. అతనికి ఇకపై చక్కటి పాత్రలు దొరికే అవకాశముంది.
అన్ని సద్గుణాలు కలిగిన ఒక నిఖార్సైన ఆర్మీ అధికారి పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించాడు. ఇక జూనియర్స్ అంటే ఇగో, జెలసీ తో రగిలిపోయే మరో ఆర్మీ అధికారి ఉంటాడు. వీరిద్దరి నడుమ ట్రాక్ నడుస్తుంది. ఈ ఎపిసోడ్ బాగుంటుంది. సినిమా బయోపిక్ తరహాలో సాగుతుంది. క్లాస్ ఆడియన్స్ కి ఈ సినిమా వంద శాతం నచ్చుతుంది. మరింకేంటి, సెప్టెంబర్ 9 న ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసి ఆనందించండి.












