
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ సీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ నుంచి Realme C51 అనే ఫోన్ భారత మార్కెట్ లోకి ప్రవేశించనుంది. రియల్మీ ఇంకా ఏ వివరాలను ఖరారు చేయలేదు. అయితే, Realme C51 ఇండియాలో లాంచ్ కావడం ఖాయమని తెలుస్తోంది. తాజాగా ఒక కొత్త లీక్ ద్వారా ఈ విషయం తెలిసింది. ఈ ఫోన్ డిజైన్ వివరాలు, ప్రధాన స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. Realme C51 ధర భారత్ లో రూ.10,000 లోపు ఉండే అవకాశం ఉంది.
సరే, ఓసారి Realme C51 స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, డిజైన్ తదితర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Realme C51 ఇండియా లాంచ్ విశేషాలు
- 108ఎంపి కెమెరాతో Realme C53 ని లాంచ్ చేసిన రియల్మీ సంస్థ Realme C51 అనే బడ్జెట్ ఫోన్ ని రూ.10,000 లోపు ధరలో భారత్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Realme C51 డివైజ్ భారత్ లో మింట్ గ్రీన్, కార్బన్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని, Realme C51 డివైజ్ ఇండియా లాంచ్ వివరాలు, కలర్ ఆప్షన్స్ ని రివీల్ చేశారు. అలాగే డిజైన్ ఇమేజెస్ కూడా షేర్ చేశారు. Realme C51 డివైజ్ ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్, డ్యూయల్-టోన్ రియర్ ప్యానెల్ కలిగి ఉంది. Realme C51 డివైజ్ రియర్ ప్యానెల్ పై భాగంలో కెమెరా రింగ్స్ చుట్టూ గ్లాసీ ఫినిషింగ్ ఉంది. మిగతాదంతా మ్యాట్ ఫినిషింగ్ ఉంది.
- Realme C51 ఫ్రంట్ లో, వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ ఉంది. డిస్ప్లేకి చుట్టూ బెజెల్స్ సన్నగా ఉన్నాయి. అయితే బాటమ్ లో చిన్ మందంగా ఉంది. ఫోన్ కి కుడివైపున పవర్, వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి.
Realme C51 స్పెసిఫికేషన్స్ (లీక్)
- డిస్ప్లే: Realme C51 డివైజ్ లో 6.7-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీ+ రెజుల్యూషన్ ఉంటాయి.
- చిప్సెట్: Realme C51 స్మార్ట్ ఫోన్ లో యూనిఎస్ఓసీ టీ612 ప్రాసెసర్ ఉండవచ్చు. ఎన్నో బడ్జెట్ రేంజ్ ఫోన్లలో ఈ చిప్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Realme C51 డివైజ్ లో 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, 4జిబి వర్చువల్ ర్యామ్ ఉంటాయని సమాచారం. ఇంకా మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా 2టిబి వరకు మెమొరీని పెంచుకునే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
- కెమెరా: Realme C51 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయని అంచనా. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది.
- బ్యాటరీ: Realme C51 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేసే అవకాశం ఉంది.
- ఓఎస్: Realme C51 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.
- కనెక్టివిటీ: Realme C51 లో సైడ్-మౌటెండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5 ఎంఎం ఆడియో జాక్, 4జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ ఉంటాయి.











