ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme జులై నెలలో Realme C63 స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. అది 4జీ టెక్నాలజీతో వచ్చింది. ఇప్పుడు Realme C63 5G ఫోన్‌ని లాంచ్ చేసేందుకు రియల్మీ సిద్ధమవుతోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీని సంస్థ టీజర్ ద్వారా ప్రకటించింది. ఆగస్టు 12వ తేదీన భారతీయ మార్కెట్ లో Realme C63 5G లాంచ్ అవుతోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.
Realme C63 5G లాంచ్ తేదీ ఖరారు
Realme C63 5G స్మార్ట్‌ఫోన్ యొక్క టీజర్‌ను తన అధికార వెబ్‌సైట్ పై రియల్మీ విడుదల చేసింది.
టీజర్ ఇమేజ్ లో ఆగస్టు 12వ తేదీన Realme C63 5G లాంచ్ అవుతుందని పేర్కొనబడి ఉంది.
Realme C63 5G డివైజ్ గోల్డెన్ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో టీజర్ పై కనిపించింది.
Realme C63 5G డివైజ్.. స్విఫ్ట్, స్మూథ్ మరియు 5జీ ఛాంపియన్ అని తన పోస్ట్ లో కంపెనీ పేర్కొంది.
Realme C63 5G డిజైన్
Realme C63 5G ఫోన్ డిజైన్ ని గమనిస్తే, బ్యాక్ ప్యానెల్ పై స్క్వేర్ షేప్ లో కర్వ్డ్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఫ్రంట్ లో పంచ్ హోల్ డిస్ప్లే ఉంది. ఈ ఫోన్‌ని చూస్తుంటే, గ్లోబల్ గా లాంచైన Realme V60 మాదిరి కనిపిస్తోంది. ఓసారి వీ60 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
Realme V60 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Realme V60 లో 6.67-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 720*1604 పిక్సెల్స్ రెజుల్యూషన్, 625 నిట్స్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
ప్రాసెసర్: Realme V60 లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడరాు. ఇది ఆక్టా-కోర్ చిప్.
స్టోరేజీ: Realme V60 డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని కలిగి ఉంది.
కెమెరా: Realme V60 లో 32ఎంపి ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ: Realme V60 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.
కనెక్టివిటీ: Realme V60 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
