Geekbench లిస్టింగ్ ద్వారా రివీలైన Realme C67 4G ప్రధాన స్పెసిఫికేషన్స్

Highlights

  • ఇండోనేషియాలో లాంచ్ కానున్న Realme C67 4G
  • తాజాగా గీక్‌బెంచ్ పై లిస్టైన Realme C67 4G
  • డిసెంబర్ 14 న Realme C67 5G ఇండియా లాంచ్

Realme C67 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో డిసెంబర్ 14 వ తేదీన లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. మరోవైపు Realme C67 4G వేరియంట్ ని ఇండోనేషియాలో లాంచ్ చేసేందుకు రియల్మీ సిద్ధమైంది. తాజాగా Realme C67 4G డివైజ్ బెంచ్ మార్కింగ్ వెబ్‌సైట్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. తొలుత ఈ విషయాన్ని 91mobiles గుర్తించింది. ఇక, గీక్‌బెంచ్ లిస్ట్ ద్వారా Realme C67 4G యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.

గీక్‌బెంచ్ పై Realme C67 4G డివైజ్ RMX3890 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. మిడిల్ ఈస్ట్ దేశాల్లో Realme C65 4G వేరియంట్ ని రియల్మీ లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇదో ఫోన్ మలేషియా మరియు ఇండోనేషియాల్లో Realme C67 4G పేరుతో లాంచ్ కానుంది. అయితే ఈ సమాచారంపై స్పష్టత రావాల్సి ఉంది.

Realme C67 4G గీక్‌బెంచ్ లిస్టింగ్

  • Realme C67 4G డివైజ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. ఆక్టా-కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ Realme C67 4G ఫోన్ లో ఉన్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • Realme C67 4G స్మార్ట్‌ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 466 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1,393 పాయింట్ల స్కోర్ నమోదు చేసింది. ఇవి కాకుండా మరే ఇతర వివరాలు లిస్టింగ్ ద్వారా రివీల్ కాలేదు.

Realme C67 4G ప్రధాన స్పెసిఫికేషన్స్ (లీక్)

Realme C67 4G ప్రధాన స్పెసిఫికేషన్స్ ని ఒక ఫేస్బుక్ యూజర్ పోస్ట్ చేశారు. అలాగే, రియల్మీ ఇండోనేషియా కూడా X పై ఒక టీజర్ ఇమేజ్ పోస్ట్ చేసింది. దీంతో త్వరలోనే అక్కడ ఈ ఫోన్ లాంచ్ కానుందని స్పష్టత వచ్చింది. అలాగే ఫోన్ డిజైన్ కూడా రివీల్ అయ్యింది.

  • డిస్ప్లే: Realme C67 4G లో ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సెంటర్ పంచ్ హోల్ కటౌట్, మినీ క్యాప్సూల్ 2.0 ఫీచర్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme C67 4G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 685 చిప్సెట్, అడ్రెనో 610 జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Realme C67 4G లో 8జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఉంటాయి.
  • సాఫ్ట్‌వేర్: Realme C67 4G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ యు కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Realme C67 4G లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇతర కెమెరా సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియలేదు.
  • బ్యాటరీ: Realme C67 4G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Realme C67 4G లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ 2.0 వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.
  • సెక్యూరిటీ: Realme C67 4G లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఐపీ54 వాటర్, డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో ఈ ఫోన్ వస్తోంది.
  • ఆడియో: Realme C67 4G లో స్టీరియో స్పీకర్ సెటప్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉంటాయి.