
తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్స్ తో ఫోన్లను తీసుకొచ్చే Tecno సంస్థ నుంచి త్వరలో Spark 20 Pro+ అనే ఫోన్ రానుంది. ఇప్పటకే టెక్నో Spark 20 సిరీస్ లో Tecno Spark 20C మరియు Tecno Spark 20 Pro డివైజెస్ ని సౌత్ ఈస్ట్ ఏషియాలో లాంచ్ చేసింది. ఇప్పుడు టెక్నో ఈ సిరీస్ లో టాప్ మోడల్ Tecno Spark 20 Pro+ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.
Tecno Spark 20 Pro+ స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Tecno Spark 20 Pro+ లో డబుల్ కర్వ్డ్ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.
- ప్రాసెసర్: Tecno Spark 20 Pro+ లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ ఉంటుంది.
- ర్యామ్, స్టోరేజీ: Tecno Spark 20 Pro+ లో 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉంటాయి. స్టోరేజీ వివరాలు ఇంకా తెలియదు.
- కెమెరా: Tecno Spark 20 Pro+ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, రెండు ఇతర సెన్సర్స్ ఉంటాయి. వాటి వివరాలు ఇంకా రివీల్ కాలేదు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- ఓఎస్: Tecno Spark 20 Pro+ డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతోంది.
Tecno Spark 20 Pro+ లాంచ్ వివరాలు, ధర
- Tecno Spark 20 Pro+ లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. కానీ, 2024 జనవరిలో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని టెక్నో సంస్థ కన్ఫర్మ్ చేసింది.
- Tecno Spark 20 Pro+ లాంచ్ తేదీ త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఇకపోతే, ఈ ఫోన్ ధర రూ.12,000 వద్ద ఉంటుందని సమాచారం. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.











