
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో S18 సిరీస్ ని లాంచ్ చేయనుంది. డిసెంబర్ 14 వ తేదీన ఈ సిరీస్ చైనాలో లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Vivo S18, Vivo S18 Pro, Vivo S18e డివైజెస్ రానున్నాయి. స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ తో Vivo S18 వస్తోంది. కాగా, తాజాగా Vivo S18 కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. అలాగే ఈ డివైజ్ ఏఐ ఫీచర్స్ తో రానున్నట్లు సమాచారం. సరే, ఓసారి Vivo S18 కలర్ ఆప్షన్స్ మరియు ఇతర వివరాలు తెలుసుకుందాం పదండి.
Vivo S18 కలర్ ఆప్షన్స్, డిజైన్
- Vivo S18 లైట్ బ్లూ, డార్క్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. చైనీస్ సామాజిక మాధ్యమం వీబై పై వివో సంస్థ ఈ వివరాలను పోస్ట్ చేసింది.
- డిజైన్ గురించి మాట్లాడితే, బ్యాక్ ప్యానెల్ పై పూల డిజైన్ కనిపిస్తోంది. ఇది ఫోన్ కి డిఫరెంట్ లుక్ ని అందిస్తోంది.
- Vivo S18 లో బ్యాక్ ప్యానెల్ పై కెమెరా మాడ్యూల్ వద్ద రింగ్ లైట్ ఉంది. తక్కువ కాంతి ఉన్న పరిస్థితుల్లో వీడియోలను తీసేందుకు ఈ రింగ్ లైట్ ఉపయోగపడుతుంది. ఇకపోతే, స్మార్ట్‌ఫోన్ స్లిమ్ గా కనిపిస్తోంది.
Vivo S18 సిరీస్ స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Vivo S18, Vivo S18 Pro డివైజెస్ లో కర్వ్డ్ ఎడ్జ్ ఓఎల్ఈడీ స్క్రీన్ ఉంటుంది. Vivo S18e లో ఫ్లాట్ ప్యానెల్ ఉంటుంది.
- ప్రాసెసర్: Vivo S18 లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. Vivo S18 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్ ఉంటుంది.
- ర్యామ్, స్టోరేజీ: Vivo S18 మరియు Vivo S18 Pro డివైజెస్ 4 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ కానున్నాయని సమాచారం. 8జిబి+256జిబి, 12జిబి+256జిబి, 12జిబి+512జిబి, 16జిబి+512జిబి వేరియంట్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
- కెమెరా: Vivo S18 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్920 ప్రైమరీ కెమెరా, 50ఎంపి శాంసంగ్ జెఎన్1 అల్ట్రావైడ్ లెన్స్, 12ఎంపి సోని ఐఎంఎక్స్663 పొట్రెయిట్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇది డ్యూయల్ సాఫ్ట్ ఎల్ఈడీ ఫ్లాష్ తో వస్తోంది. మరోవైపు Vivo S18 లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా ఉంటుందని సమాచారం.
- బ్యాటరీ: Vivo S18, Vivo S18 Pro ఫోన్లలో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.











