లీకైన వరల్డ్ ఫాస్టెస్ట్ ఫోన్ Realme GT 3 గ్లోబల్ లాంచ్ తేదీ

Highlights

  • ఎండబ్ల్యూసీ 2023 ఈవెంట్ లో ఎంట్రీ ఇచ్చిన Realme GT 3
  • టిప్‌స్టర్ ద్వారా లీకైన Realme GT 3 అఫీషియల్ టీజర్ పోస్టర్
  • స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్‌తో రానున్న Realme GT 3

ఈ ఏడాది ఆరంభంలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 ఈవెంట్ లో Realme GT 3 ని సందరు సంస్థ పరిచయం చేసింది. తాజాగా టిప్‌స్టర్ పారస్ గుగ్లాని Realme GT 3 డివైజ్ అఫీషియల్ టీజర్ ఇమేజ్ ని షేర్ చేశారు. 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోన్న తొలి ఫోన్ Realme GT 3 కావడం విశేషం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫోన్లలో ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్ గా Realme GT 3 పరిగణించబడుతోంది.

అతి త్వరలో ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కానుంది. భారత్ లో ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు. అయితే ఈ ఫోన్ ఇప్పటికే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ ని పొందింది. దీంతో భారత్ లో ఈ ఫోన్ లాంచ్ కానుందని అర్థమవుతోంది. అయితే భారత్ లో Realme GT 3 లాంచ్ కి సంబంధించి రియల్మీ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Realme GT 3 గ్లోబల్ లాంచ్ తేదీ

Realme GT 3 స్మార్ట్ ఫోన్ గ్లోబల్ గా జూన్ 14 న లాంచ్ అవ్వనుందని లీకైన పోస్టర్ ద్వారా తెలుస్తోంది. టిప్‌స్టర్ పారస్ గుగ్లాని ఈ పోస్టర్ ని షేర్ చేశారు. అయితే దీనికి సంబంధించి కంపెనీ నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది.

Realme GT 3 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme GT 3 లో 6.74-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2772*1240 పిక్సెల్స్ రెజుల్యూషన్, 93.69 పర్సెంట్ కాంట్రాస్ట్ రేషియో, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1.07 బిలియన్ కలర్స్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme GT 3 డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 4ఎన్ఎమ్ మొబైల్ ప్లాట్ఫామ్ పై తయారైంది. దీనిలో అడ్రెనో జీపీయూ గ్రాఫిక్స్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Realme GT 3 స్మార్ట్ ఫోన్ 8జిబి+128జిబి, 12జిబి+256జిబి, 16జిబి+256జిబి, 16జిబి+512జిబి, 16జిబి+1టిబి వేరియంట్స్ లో లభించనుంది.
  • ఓఎస్, బ్యాటరీ: Realme GT 3 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 240 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
  • కనెక్టివిటీ: Realme GT 3 స్మార్ట్ ఫోన్ లో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • కెమెరా: Realme GT 3 స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 సెన్సర్, ఓఐఎస్, ఎల్ఈడీ ఫ్లాష్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మైక్రోస్కోప్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
Previous articleDimensity 9000 చిప్, 16జిబి ర్యామ్‌తో Geekbench పై కనిపించిన OnePlus Nord 3
Next articleలీకైన Realme GT Neo 5 Pro స్పెసిఫికేషన్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.