
OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ త్వరలోనే లాంచ్ కానుంది. ఇంకా కచ్చితమైన తేదీ తెలియదు. ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్, డిజైన్ మరియు ధర వివరాలు కొన్ని రోజుల క్రితమే లీక్ అయ్యాయి. ఇప్పుడు ఒక కొత్త వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్ బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్ గీక్ బెంచ్ పై కనిపించింది. ఇది OnePlus Nord 3 డివైజ్ అని భావిస్తున్నారు. గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఈ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్, 16జిబి ర్యామ్ తో వస్తున్నట్లు తెలిసింది.
OnePlus Nord 3 గీక్‌బెంచ్ లిస్టింగ్
- గీక్ బెంచ్ పైన కనిపించిన వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్ CPH2493 అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఇది OnePlus Nord 3 కి సంబంధించిందని మైస్మార్ట్ ప్రైస్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.
- 3.05 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగిన ఒక ఆక్టా-కోర్ ప్రాసెసర్ k6983_v1 అనే కోడ్ నంబర్ తో కనిపించింది. ఇది కచ్చితంగా మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ అయ్యే అవకాశం ఉంది.
- OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ సింగిల్ కోర్ టెస్ట్ లో 791 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1806 పాయింట్లు సాధించింది.
- గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా OnePlus Nord 3 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
- OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ OnePlus Ace 2V కి రీబ్రాండ్ వర్షన్ అని వార్తలు వినిపిస్తున్నాయి. సరే, ఓసారి OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: OnePlus Nord 3 లో 6.74-ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కౌటౌట్ ఉంటాయి.
- ప్రాసెసర్: OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ ఉంటుందని భావిస్తున్నారు.
- ర్యామ్, స్టోరేజీ: OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ లో 12జిబి ర్యామ్/16జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ ఉంటాయి.
- కెమెరా: OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
- ఓఎస్: OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.












