
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Realme త్వరలోనే GT సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme GT 5 Pro పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. కంపెనీ ఇప్పటికే కీలక స్పెసిఫికేషన్స్ ని కన్ఫర్మ్ చేసింది. అలాగే గత కొన్ని రోజుల నుంచి డివైజ్ కి సంబంధించిన వార్తలు లీక్ అవుతూనే ఉన్నాయి. తాజా సమాచారాన్ని గమనించినట్లయితే, Realme GT 5 Pro యొక్క స్పెసిఫికేషన్, ధర, లైవ్ ఇమేజ్ బయటకు వచ్చాయి. దీంతో మరిన్ని విషయాలు రివీల్ అయ్యాయి.
Realme GT 5 Pro డిజైన్ (లీక్)
- చైనాకు చెందిన మైక్రో బ్లాగింగ్ సైట్ వీబో పై ఒక యూజర్ Realme GT 5 Pro యొక్క ఇమేజ్ ని షేర్ చేశారు.
- Realme GT 5 Pro ఇమేజ్ ని చూస్తే, తెలుపు రంగు వేరియంట్ రివీల్ అయినట్లు తెలుస్తోంది.
- స్మార్ట్ ఫోన్ లో బ్యాక్ ప్యానెల్ పై భారీ సర్క్యులర్ కెమెరా కటౌట్ కనిపిస్తోంది.
- ట్రిపుల్ కెమెరా సెటప్ , ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నట్లు తెలుస్తోంది.
- డిస్ప్లే విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 6.78-ఇంచ్ బీఓఈ స్క్రీన్ ఉంటుంది. ఇది 2780*1264 పిక్సెల్స్ రెజుల్యూషన్ ని కలిగి ఉంటుంది.
Realme GT 5 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)
- ప్రాసెసర్: Realme GT 5 Pro లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ వాడినట్లు సమాచారం.
- మెమొరీ: Realme GT 5 Pro డివైజ్ 1టిబి వరకు స్టోరేజీతో వస్తున్నట్లు తెలుస్తోంది.
- బ్యాటరీ: Realme GT 5 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని సమాచారం. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
- కెమెరా: Realme GT 5 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి సెకండరీ లెన్స్, 8ఎంపి థర్డ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది.
Realme GT 5 Pro ధర (లీక్)
- లీకైన సమాచారాన్ని బట్టి, Realme GT 5 Pro 3 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అవుతుందని తెలుస్తోంది.
- 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర CNY 2,999 (సుమారు రూ.34,200) ఉండే అవకాశం ఉంది.
- 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 3,299 (సుమారు రూ.37,700) ఉంటుందని అంచనా.
- 24జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ మోడల్ ధర CNY 3,699 (సుమారు రూ.42,200) గా ఉండే అవకాశం ఉంది.













