హైలైట్స్
- మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 లో లాంచ్ కానున్న Realme GT Neo 5 స్మార్ట్ ఫోన్
- ఫిబ్రవరి 27 నుంచి మార్చి 2 వరకు బార్సిలోనా లో జరగనున్న MWC 2023 సదస్సు
- 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోన్న Realme GT Neo 5 స్మార్ట్ ఫోన్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme రీసెంట్ గా తన 240 వాట్ సూపర్ వూక్ చార్జింగ్ టెక్నాలజీని ప్రకటించింది. ఈ టెక్నాలజీ Realme GT Neo 5 ఫోన్ ద్వారా పరిచయం కానుంది. ఇప్పుడు ప్రైస్ బాబా రిపోర్ట్స్ ప్రకారం, Realme GT Neo 5 గ్లోబల్ గా Mobile World Congress 2023 లో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది.
తన యొక్క 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని లాంచ్ చేయడానికి మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 సదస్సు సరైన చోటని రియల్మీ కంపెనీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక అదే సదస్సులో Realme GT Neo 5 గ్రాండ్ గా లాంచ్ కానుంది. సరే, ఓసారి Realme GT Neo 5 యొక్క లాంచ్ టైమ్ లైన్ తో పాటు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. పదండి.
Realme GT Neo 5 లాంచ్ టైమ్‌లైన్
Realme GT Neo 5 స్మార్ట్ ఫోన్ జనవరి లేదా ఫిబ్రవరి మాసాల్లో లాంచ్ కానుందని గతంలో పలు రిపోర్ట్స్ వచ్చాయి. అయితే, ఇండస్ట్రీ వర్గాల నుంచి అందిన సమాచారాన్ని బట్టి Pricebaba తాజాగా Realme GT Neo 5 ఫోన్ MWC 2023 లో గ్లోబల్ గా లాంచ్ అవుతుందని తెలిపింది. అంటే ఫిబ్రవరి 27 నుంచి మార్చి 2 వరకు బార్సిలోనా లో జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సదస్సులో ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది.
Realme GT Neo 5 స్పెసిఫికేషన్స్ (అంచనా)
Realme GT Neo 5 స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ 1.5కే ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానుంది. ఈ ఫోన్ రెండు బ్యాటరీ వేరియంట్స్ లో లభిస్తుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వేరియంట్ 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. 4600 ఎంఏహెచ్ బ్యాటరీ వేరియంట్ 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది.
Realme GT Neo 5 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
Realme GT Neo 5 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ఉంటుంది. 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో ఈ ఫోన్ వస్తోంది. Realme GT Neo 5 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












