హైలైట్స్
- టెస్టింగ్ దశలో ఉన్న OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్
- 2023 జూన్ నెలలో భారత్ లో OnePlus Nord 3 లాంచ్ అయ్యే అవకాశం
- 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్న OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్
చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్ త్వరలో OnePlus Nord 3 ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. నార్డ్ సిరీస్ లో సరసమైన ధరల్లో ఫోన్లను తీసుకొస్తోంది వన్ ప్లస్. ప్రత్యేకించి భారత్ లో ఈ సిరీస్ కి యూజర్లలో డిమాండ్ ఎక్కువ. MySmartPrice రిపోర్ట్ ప్రకారం, ప్రస్తుతం OnePlus Nord 3 ఫోన్ ని Larry అనే కోడ్ నేమ్ తో టెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే భారత్ లో జూన్ నెలలో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని తెలుస్తోంది.
ప్రస్తుతం భారత్ లో అందుబాటులో ఉన్న నార్డ్ సిరీస్ ఫోన్లన్నింటి కంటే OnePlus Nord 3 మెరుగ్గా ఉండనుందని సమాచారం. సరే, ఓసారి OnePlus Nord 3 యొక్క ఎక్స్‌పెక్టెడ్ లాంచ్ టైమ్, స్పెసిఫికేషన్స్ వివరాలను తెలుసుకుందాం పదండి.
భారత్ లో OnePlus Nord 3 లాంచ్
ఒక రిపోర్ట్ ప్రకారం, OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ భారత్ లో జూన్ నెలలో లాంచ్ కానుందని సమాచారం. అయితే, దీనికి సంబంధించి ఇప్పటి వరకు కంపెనీ నుంచి ప్రకటన రాలేదు. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్ (అంచనా)
ప్రస్తుతం OnePlus Nord 3 పూర్తి స్పెసిఫికేషన్స్ తెలియలేదు. అయితే ఈ ఫోన్ ఏయే స్పెసిఫికేషన్స్ తో రానుందో ఒక అవగాహన వచ్చింది. అంచనాల ప్రకారం, ఈ ఫోన్ 120 హెర్ట్జ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 50ఎంపి ప్రైమరీ సెన్సర్, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 5జీ కనెక్టివిటీ ఈ ఫోన్ లో ఉంటాయి.
OnePlus Nord 2T స్పెసిఫికేషన్స్
OnePlus Nord 2T.. నార్డ్ సిరీస్ లో చివరగా వచ్చిన ఫోన్ ఇదే. 2022 జులై నెలలో రూ.28,999 ధరతో భారత మార్కెట్ లో లాంచైంది. ఈ ఫోన్ 6.43-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 50ఎంపి ఓఐఎస్ సోని ఐఎంఎక్స్766 ప్రైమరీ లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మోనో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 కెమెరా ఉంది.
OnePlus Nord 2T లో మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్సెట్ వాడారు. ఇది 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో వచ్చింది. ఇందులో పవర్ బ్యాకప్ కోసం 4500ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. ఈ ఫోన్ లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. OnePlus Nord 2T లో అలర్ట్ స్లైడర్ కూడా ఉండటం విశేషం.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












