
Realme GT Neo 5 SE స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన లీక్స్, ఇన్ఫర్మేషన్ గత కొన్నాళ్ళుగా వస్తూనే ఉన్నాయి. అలాగే వివిధ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై Realme GT Neo 5 SE డివైజ్ కనిపించింది. వీటిలో గీక్‌బెంచ్ కూడా ఉంది. ఇప్పుడు స్వయంగా రియల్మీ సంస్థ Realme GT Neo 5 SE డివైజ్ లాంచ్ ని కన్ఫర్మ్ చేసింది. సోషల్ మీడియా పోస్ట్ ద్వారా Realme GT Neo 5 SE స్మార్ట్ ఫోన్ రాకను రియల్మీ ఖరారు చేసింది. కానీ, లాంచ్ తేదీ వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే, ఈ నెలలో లేదా వచ్చే నెలలో ఫోన్ లాంచ్ కావొచ్చని అంచనా వేస్తున్నారు.
అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిన Realme GT Neo 5 SE లాంచ్
ప్రమోషనల్ పోస్టర్ ద్వారా Realme GT Neo 5 SE లాంచ్ ఖరారు అయ్యింది. రియల్మీ సంస్థ చైనీస్ సోషల్ మీడియా మాధ్యమం వీబో పై పోస్టర్ ని షేర్ చేయడంతో సమాచారం బయటకు వచ్చింది. ఎన్నో లీక్స్, రూమర్ల తర్వాత ఎట్టకేలకు రియల్మీ సంస్థ ఫోన్ పేరుని అనౌన్స్ చేసింది. అయితే, పోస్టర్ ద్వారా మరే ఇతర సమాచారం మనకు లభించలేదు. అలాగే Realme GT Neo 5 SE డివైజ్ ఫీచర్లు, డిజైన్ రివీల్ కాలేదు.
Realme GT Neo 5 SE స్పెసిఫికేషన్స్ (అంచనా)
Realme GT Neo 5 SE స్మార్ట్ ఫోన్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్నట్లు సమాచారం. ఈ డివైజ్ లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ ఫోన్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, Realme GT Neo 5 SE డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది. బ్యాటరీ విభాగం వైపు చూస్తే, ఈ డివైజ్ 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉండనుందని సమాచారం. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఈ ఫోన్ లో యూఎస్బీ టైప్-సీ చార్జింగ్ పోర్ట్ ఉండనుంది.
Realme GT Neo 5 SE లో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉండే అవకాశం ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం Realme GT Neo 5 SE లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుందని సమాచారం. ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ అంచనా మాత్రమే. రియల్మీ నుంచి అధికారికంగా స్పెసిఫికేషన్స్ కి సంబంధించిన ప్రకటన రావాల్సి ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












