
మార్చి 21 న భారత్ లో Realme C55 లాంచ్ కానుంది. తరచూ రియల్మీ సంస్థ ఈ ఫోన్ ని టీజ్ చేస్తూ పలు స్పెసిఫికేషన్స్, ఫీచర్లను రివీల్ చేస్తూ వస్తోంది. ఇప్పుడు ఫోన్ ఇంకా మార్కెట్ లోకి రాకముందే, Realme C55 ఇండియా ధర లీకైంది. ఈ ఫోన్ 3 మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ కానున్నట్లు సమాచారం. Realme C55 ఫోన్ ప్రారంభ ధర రూ.10,000 లకు కంటే కాస్త ఎక్కువ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
లీకైన Realme C55 ఇండియా ధర
ప్రముఖ టిప్‌స్టర్ సుదాన్శు Realme C55 ధరకు సంబంధించిన సమాచారాన్ని రివీల్ చేశాడు. భారత్ లో Realme C55 మూడు వేరియంట్స్ లో లాంచ్ కానున్నట్లు సమాచారం. బేస్ వేరియంట్ ఫోన్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ తో రానుంది. లీక్ ప్రకారం, Realme C55 ధర రూ.10,000 కంటే కాస్త ఎక్కువ ఉండనున్నట్లు తెలుస్తోంది.
Realme C55 యొక్క 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్స్ కూడా మార్కెట్ లోకి రానున్నాయి. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.20,000 ల కంటే కాస్త తక్కువ ఉంటుందని టిప్‌స్టర్ అభిప్రాయపడ్డాడు. Realme C55 భారత మార్కెట్ ధర రూ.11,999 నుంచి రూ.18,999 కి మధ్యలో ఉంటుందని అంచనా వేయవచ్చు.
భారత్ లో Realme C55 లాంచ్
Realme C55 స్మార్ట్ ఫోన్ భారత్ లో మార్చి 21 న మధ్యాహ్నం 12.30 గంటలకు లాంచ్ కానుంది. ఫోన్ లాంచ్ ని అఫీషియల్ గా అన్నీ రియల్మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ పై ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ లో Realme C55 యొక్క మైక్రోసైట్ దర్శనమిస్తోంది.
Realme C55 స్పెసిఫికేషన్స్
- 8జిబి + 8జిబి (డైనమిక్ ర్యామ్)
- 64ఎంపి మెయిన్ కెమెరా
- 33 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్
- 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
Realme C55 స్మార్ట్ ఫోన్ 8జిబి డైనమిక్ ర్యామ్ టెక్నాలజీ తో వస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ టెక్నాలజీ ద్వారా ఫోన్ అత్యధికంగా 16జిబి ర్యామ్ పవర్ తో పని చేయనుంది. భారత మార్కెట్ లో ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ88 ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో లాంచ్ కానుంది.
Realme C55 స్మార్ట్ ఫోన్ 64ఎంపి మెయిన్ కెమెరాతో వస్తోంది. ఇతర లెన్సెస్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 27 రోజుల స్టాండ్ బై టైమ్ ని ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ లో 6.52-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











