
Realme GT Neo 5 స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 9 న చైనాలో లాంచ్ అవుతోంది. ఈ డివైజ్ భారత్ లో ఇదే ఏడాది లాంచ్ అవ్వనుంది. అయితే కచ్చితమైన సమయం తెలియలేదు. రియల్మీ నుంచి దీనికి సంబంధించి త్వరలోనే ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే ఈలోపే, కంపెనీ Realme GT Neo 5 యొక్క డిజైన్ ని రివీల్ చేసింది.
Realme GT Neo 5 పర్పుల్ ఫ్యాంటసీ కలర్ ఆప్షన్ లో లాంచ్ కానుంది. టీజర్స్ ద్వారా ఫోన్ కి సంబంధించిన కొన్ని ప్రధాన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. సరే, ఓసారి Realme GT Neo 5 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Realme GT Neo 5 డిజైన్, స్పెసిఫికేషన్స్
Realme GT Neo 5 స్మార్ట్ ఫోన్ ఎన్నో అప్‌గ్రేడ్స్ తో రానుంది. ఫ్లాగ్షిప్ గ్రేడ్ స్పెక్స్ తో ఈ ఫోన్ వస్తోంది. లేటెస్ట్ టీజర్ ప్రకారం, Realme GT Neo 5 ఫోన్ సరికొత్త పర్పుల్ కలర్ ఆప్షన్ లో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. కర్వ్డ్ రియర్ ప్యానెల్ ఏజీ గ్లాస్ టెక్నాలజీతో వస్తోంది. అలాగే ఇది పర్పుల్ కలర్ ఆప్షన్ లో మ్యాట్ ఫినిష్ ని అందించనుంది.
Realme GT Neo 5 ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై కెమెరా మాడ్యూల్ క్రింద మనం నిలువుగా ఉన్న చారలను గమనించవచ్చు. కెమెరా సెన్సర్స్ మరియు ఆర్జీబీ లైట్స్ కోసం బ్యాక్ ప్యానెల్ పై భాగాన భారీ ఐల్యాండ్ ఉంది. రెండు సర్క్యులర్ కెమెరా కటౌట్స్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ మాడ్యూల్ ఉంటుంది.
Realme GT Neo 5 స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ వాడారు. త్వరలో లాంచ్ కానున్న OnePlus 11R 5G లో ఇదే చిప్సెట్ వాడటం జరిగింది. ఈ డివైజ్ Sony IMX890 50MP కెమెరాతో వస్తున్నట్లు రియల్మీ ఖరారు చేసింది. ఈ ఫోన్ ప్రైమరీ కెమెరా ఓఐఎస్ సపోర్ట్ తో వస్తోంది.
Realme GT Neo 5 హైలైట్ గా నిలవనున్న 240W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
Realme GT Neo 5 ఫోన్ లో హైలైట్ గా నిలుస్తున్న ఫీచర్ 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ. ఈ చార్జింగ్ టెక్నాలజీ అన్ని భద్రత ప్రమాణాలను పాటిస్తూ, ఉత్తమైన అనుభూతిని పంచుతుందని కంపెనీ చెబుతోంది. TUV Rheinland నుంచి సేఫ్ ఫాస్ట్ చార్జింగ్ సర్టిఫికేషన్ ని కూడా ఈ ఫోన్ పొందింది. సూపర్‌వూక్ చార్జింగ్ టెక్నాలజీ కేవలం 30 సెకన్ల చార్జ్ తో 2 గంటల కాలింగ్ టైమ్ ని అందిస్తుంది.
ఇతర వివరాలను చూస్తే, Realme GT Neo 5 లో 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
Realme GT Neo 5 లో 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ అందించారు. మిగతా ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిప్ పై పని చేస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











