
OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 7 న భారత్ లో లాంచ్ అవుతోంది. ఈ లాంచ్ ఈవెంట్ లో ఫ్లాగ్షిప్ ఫోన్ OnePlus 11 5G తో పాటు సెకండ్ ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్ గా OnePlus 11R 5G లాంచ్ కానుంది. ఇక వన్‌ప్లస్ నుంచి వస్తోన్న లేటెస్ట్ ఫ్లాగ్షిప్ OnePlus 11 5G, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ తో పోటీపడనుంది. మరోవైపు చూస్తే, OnePlus 11R 5G ఫ్లాగ్షిప్ గ్రేడ్ స్పెసిఫికేషన్స్ కలిగి, అందుబాటు ధరలో లభించనుంది. ఈ డివైజ్ చైనాలో OnePlus Ace 2 పేరుతో లాంచ్ అవుతోంది.
లాంచ్ కి ముందు OnePlus 11R 5G యొక్క స్పెసిఫికేషన్స్ ని కంపెనీ టీజ్ చేస్తూ వస్తోంది. తాజాగా OnePlus 11R 5G యొక్క డిస్ప్లే స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. OnePlus 11R 5G ఫోన్ 6.74-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే తో వస్తోంది. సరే, ఓసారి OnePlus 11R 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
వన్‌ప్లస్ 11ఆర్ 5జీ డిస్ప్లే స్పెసిఫికేషన్స్ (లీక్డ్)
ప్రస్తుతం ఉన్న వన్‌ప్లస్ డివైజెస్ తో పోల్చితే, OnePlus 11R 5G ఎన్నో అప్ గ్రేడ్స్ తో వస్తోంది. OnePlus 11R 5G ఫోన్ 6.74-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే తో వస్తోంది. టీజర్ ఇమేజ్ ని బట్టి చూస్తే, స్క్రీన్ కర్వ్డ్ గా ఉన్నట్లు అనిపిస్తోంది. టాప్ సెంటర్ లో హోల్ పంచ్ కటౌట్ ఉంది. ఇందులో ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. ఈ ఫోన్ లో ఉన్న LTPS డిస్ప్లే 40Hz, 45Hz, 60Hz, 90Hz, 120Hz మధ్య డైనమిక్ గా స్విచ్ అవుతుందని కంపెనీ ఇప్పటికే చెప్పింది.
OnePlus 11R 5G హయ్యర్ రెజుల్యూషన్ తో వస్తోంది. ఈ ఫోన్ 1.5కే డిస్ప్లే రెజుల్యూషన్ (2772*1240 పిక్సెల్స్) తో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. ఈ డిస్ప్లే 100 శాతం డీసీఐ-పీ3 కలర్ గేముత్, హై ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ వంటి ఫీచర్స్ ని కలిగి ఉంది. బ్రైట్నెస్ విషయానికి వస్తే, OnePlus 11R 5G డివైజ్ 1450 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












