Realme: Snapdragon 8s Gen 3 చిప్‌తో లాంచ్ కానున్న GT Neo 6, లాంచ్ తేదీ ఖరారు

Highlights

  • Realme GT Neo 6 లాంచ్ తేదీ ఖరారు
  • చైనాలో మే 9న Realme GT Neo 6 లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో జీటీ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Realme GT Neo 6 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క చైనా లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ని ఈ ఫోన్ లో వాడినట్లు ప్రొడక్ట్ పేజీ ద్వారా తెలుస్తోంది. ఇతర స్పెసిఫికేషన్స్ కూడా ప్రొడక్ట్ పేజీ ద్వారా రివీల్ అయ్యాయి. ఓసారి లాంచ్ తేదీ వివరాలు మరియు రివీలైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Realme GT Neo 6 లాంచ్ తేదీ

Realme GT Neo 6 చైనాలో మే 9వ తేదీన లాంచ్ అవుతోంది. భారతీయ మార్కెట్ లో ఇంకా రియల్మీ జీటీ సిరీస్ అందుబాటులో లేదు. ప్రస్తుతం చైనా మార్కెట్ కే ఈ ఫోన్ పరిమితం కానుంది. హై-ఎండ్ స్పెసిఫికేషన్స్ గల ఈ ఫోన్ ధర రూ.25,000 నుంచి రూ.28,000 మధ్య ఉండే అవకాశం ఉంది.

Realme GT Neo 6 స్పెసిఫికేషన్స్

ప్రాసెసర్: Realme GT Neo 6 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ స్పీడ్ 3GHz.

మెమొరీ: Realme GT Neo 6 డివైజ్ 1టిబి స్టోరేజీతో లాంచ్ కానుంది. 16జిబి/8జిబి ర్యామ్ వేరియంట్స్ కూడా లాంచ్ కానున్నాయి. 256జిబి స్టోరేజీని బేస్ వేరియంట్ లో అందించనున్నారు.

చార్జింగ్: Realme GT Neo 6 డివైజ్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోంది. బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియదు. కొన్ని నిమిషాల్లోనే బ్యాటరీ పూర్తిగా చార్జ్ అవుతుంది. వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో ఉంటుంది.

Realme GT Neo 6 SE స్పెసిఫికేషన్స్

Realme GT Neo 6 SE లో 6.78-ఇంచ్ పంచ్ హోల్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, ఎల్టీపీవో ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.

Realme GT Neo 6 SE లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.8GHz. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 732 జీపీయూ వాడారు.

Realme GT Neo 6 SE డివైజ్ చైనాలో 4 వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. అవి: 8జిబి+256జిబి, 12జిబి+256జిబి, 16జిబి+256జిబి మరియు 16జిబి+512జిబి.

Realme GT Neo 6 SE లో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

Realme GT Neo 6 SE లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Realme GT Neo 6 SE లో ఐపీ65 రేటింగ్, ఐఆర్ బ్లాస్టర్, ఎన్ఎఫ్‌సీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.

Previous articleRedmi: స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్‌తో లాంచ్ కానున్న Redmi K80 సిరీస్
Next articleTecno Camon 30 సిరీస్ ఇండియా లాంచ్ ఖరారు
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.