
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో జీటీ సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ తొలుత చైనాలో లాంచ్ అవ్వనుంది. తర్వాత ఇతర మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అయితే భారత్ లో ఈ సిరీస్ లాంచ్ అవుతుందా లేదా అనే దానిపై స్పష్టత రాలేదు. తాజాగా, రియల్మీ సంస్థ Realme GT సిరీస్ ను భారత్ లో కూడా లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో రియల్మీ లవర్స్‌కి శుభవార్త చెప్పినట్లైంది. Realme GT Neo 6 లేదా GT Neo 6 SE భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Realme GT సిరీస్ ఇండియా లాంచ్
Realme GT సిరీస్ ఇండియా లాంచ్‌ని రియల్మీ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. మే నెలలో ఈ సిరీస్ లో ఒక ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. భారత్ లో ఏ ఫోన్‌ని లాంచ్ చేయనున్నారో రియల్మీ ఇంకా తెలపలేదు. Realme GT Neo 6 లేదా Realme GT Neo 6 SE ఫోన్లలో ఒకటి లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
Realme GT Neo 6 స్పెసిఫికేషన్స్
Realme GT Neo 6 ఈ వారంలో చైనాలో లాంచ్ అవ్వబోతోంది. చైనాలో లాంచైన తర్వాత భారతీయ మార్కెట్ లో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని స్పెసిఫికేషన్స్‌ని కంపెనీ రివీల్ చేసింది. ఓసారి అవెలా ఉన్నాయో చూద్దాం.
ప్రాసెసర్: Realme GT Neo 6 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3GHz.
మెమొరీ: Realme GT Neo 6 1టిబి స్టోరేజీతో లాంచ్ కానుంది. ఈ మోడల్ 16జిబి ర్యామ్ ని ఆఫర్ చేస్తుంది. మరొక వేరియంట్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో వస్తోంది.
చార్జింగ్: Realme GT Neo 6 డివైజ్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియలేదు.











