
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme ఏప్రిల్ నెలలో భారతీయ మార్కెట్ లో Realme Narzo 70 5G డివైజ్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ తక్కువ బడ్జెట్ లో మంచి ఫీచర్లతో వచ్చింది. ఈ ఫోన్ లో 50ఎంపి కెమెరా, 8జిబి ర్యామ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డైమెన్సిటీ 7050 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. తాజాగా రియల్మీ ఈ ఫోన్‌పై రూ.2,000 డిస్కౌంట్ ప్రకటించింది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Realme Narzo 70 5G ఆఫర్, ధర
Realme Narzo 70 5G స్మార్ట్‌ఫోన్ యొక్క రెండు వేరియంట్స్ పై రూ.2,000 డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 6జిబి ర్యామ్ మోడల్ ధర రూ.15,999 కాగా, డిస్కౌంట్ తర్వాత దీన్ని రూ.13,999 కి లభించనుంది. 8జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.16,999 గా ఉంది. తగ్గింపు తర్వాత రూ.14,999 కే ఈ ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు.
Realme Narzo 70 5G స్మార్ట్‌ఫోన్ పై ఆఫర్‌ను రియల్మీ వెబ్‌సైట్ మరియు అమెజాన్ ద్వారా పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ పరిమిత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్‌ని 3 నెలల వ్యవధితో నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ లో కొనుగోలు చేయవచ్చు.
Realme Narzo 70 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Realme Narzo 70 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 600 నిట్స్ బ్రైట్నెస్, రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ ఉన్నాయి.
ప్రాసెసర్: Realme Narzo 70 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. ఈ ఫోన్ లో మాలి-జీ68 జీపీయూ గ్రాఫిక్స్, 3డీ వీసీ కూలింగ్ సిస్టమ్ ఉన్నాయి.
కెమెరా: Realme Narzo 70 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ600 మెయిన్ సెన్సర్, 2ఎంపి బ్లాక్ అండ్ వైట్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ: Realme Narzo 70 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చింది.
సాఫ్ట్‌వేర్: Realme Narzo 70 5G ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్‌కి 3 ఏళ్ళు మేజర్ ఓఎస్ అప్డేట్స్, 2 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.
కనెక్టివిటీ: Realme Narzo 70 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.











