itel Color Pro 5G: లాంచ్‌కి ముందు రివీలైన ఐటెల్ స్పెసిఫికేషన్స్

Highlights

  • త్వరలో itel Color Pro 5G లాంచ్
  • 6.6-ఇంచ్ ఎల్సీడీ ప్యానెల్
  • డైమెన్సిటీ 6080 చిప్సెట్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ itel త్వరలో ఒక కలర్ చేంజింగ్ ఫోన్ లాంచ్ చేయనుంది. ఈ విషయాన్ని తొలుత 91mobiles తెలియజేసింది. తాజాగా కొత్త అప్డేట్‌లో ఈ ఫోన్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. రానున్న కొన్ని రోజుల్లో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో విడుదలవుతుందని ఐటెల్ కన్ఫర్మ్ చేసింది.

itel Color Pro 5G స్పెసిఫికేషన్స్

itel Color Pro 5G స్మార్ట్‌ఫోన్ యొక్క వివరాలను MySmartPrice వెబ్‌సైట్ షేర్ చేసింది.

ఆ కథనం ప్రకారం, itel Color Pro 5G డివైజ్ 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, వాటర్ డ్రాప్ నాచ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

itel Color Pro 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ తో వస్తోంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్.

ఈ ఫోన్ NRCA (5G++) టెక్నాలజీతో వస్తోంది. దీని ద్వారా మెరుగైన 5జీ నెట్వర్క్ కవరేజీని పొందే వీలుంటుంది.

అలాగే 5జీ కనెక్టివిటీ నుంచి తిరిగి 4జీ సిగ్నల్స్ కి పడిపోయే వీక్ నెట్వర్క్ ప్రాంతాల్లో ఎన్ఆర్సీఏ టెక్నాలజీ స్మార్ట్‌ఫోన్లకు ఉపయోగపడుతుంది.

itel Color Pro 5G డివైజ్ IVCO టెక్నాలజీతో వస్తోందని ఐటెల్ కన్ఫర్మ్ చేసింది. దీని ద్వారా ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై సూర్యకాంతి పడినప్పుడు రంగు మారుతుంది.

itel Color Pro 5G డిజైన్ మరియు ధర (అంచనా)

itel Color Pro 5G స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. ఫోన్ ముందువైపు వాటర్ డ్రాప్ నాచ్ ప్యానెల్ ఉంటుంది. ధర విషయానికి వస్తే, itel Color Pro 5G ఫోన్ బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ కానుంది. రూ.12,000 నుంచి రూ.15,000 మధ్య ఫోన్ ధర ఉంటుందని అంచనా వేస్తున్నారు.