Samsung Galaxy A55 5G ధర వివరాలు తెలుసుకోండి

Highlights

  • Galaxy A55 5G ధర వెల్లడి
  • డివైజ్ ప్రారంభ ధర రూ.39,999
  • రూ.3,000 బ్యాంక్ డిస్కౌంట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె గెలాక్సీ ఏ-సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Samsung Galaxy A55 5G మరియు Samsung Galaxy A35 5G మోడల్స్ లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్లు ఆకట్టుకునే డిజైన్‌ని కలిగి ఉన్నాయి. ఎగ్జినోస్ ప్రాసెసర్స్‌ని శాంసంగ్ ఈ ఫోన్లలో వాడింది. ఈ ఆర్టికల్ లో మనం Samsung Galaxy A55 5G యొక్క ధర, ఆఫర్లు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy A55 5G ధర, ఆఫర్లు

Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy A55 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.39,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.42,999 గా ఉంది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.45,999 గా ఉంది.

Samsung Galaxy A55 5G ఫోన్ కొనే హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ యూజర్లకు మరియు ఐడీఎఫ్‌సీ, వన్‌కార్డ్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు రూ.3,000 డిస్కౌంట్ లభిస్తుంది.

Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ ఆసమ్ ఐస్‌బ్లూ మరియు ఆసమ్ నేవీ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. కంపెనీ వెబ్‌సైట్ ద్వారా డివైజ్‌ని కొనుగోలు చేసే యూజర్లకు సిలికాన్ కేస్‌ని కంపెనీ అందిస్తోంది.

Samsung Galaxy A55 5G డివైజ్ ని మార్చి 14 నుంచి శాంసంగ్.ఇన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. మార్చి 18 నుంచి ఇతర ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ ద్వారా సేల్‌కి వస్తుంది.

Samsung Galaxy A55 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy A55 5G లో 6.6-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: శాంసంగ్ గెలాక్సీ ఏ55 5జీ డివైజ్ లో ఎగ్జినోస్ 1480 చిప్సెట్, ఏఎండీ ఎక్స్‌క్లిప్స్ 530 జీపీయూ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: శాంసంగ్ గెలాక్సీ ఏ55 5జీ డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 4 ఆండ్రాయిడ్ వర్షన్ అప్‌గ్రేడ్స్, 5 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఫోన్‌కి లభిస్తాయి.
  • కెమెరా: Samsung Galaxy A55 5G లో 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Samsung Galaxy A55 5G లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.
  • సెక్యూరిటీ: Samsung Galaxy A55 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు.
  • ఇతర ఫీచర్లు: శాంసంగ్ గెలాక్సీ ఏ55 5జీ లో డ్యూయల్ సిమ్, 5జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 6, గ్లొనాస్, బైడూ, గెలీలియో, యూఎస్‌బీ 2.0 ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Samsung Galaxy A55 5G డివైజ్ ఆసమ్ ఐస్‌బ్లూ, ఆసమ్ లైలాక్, ఆసమ్ నేవీ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Previous articleRealme: లాంచ్‌కి ముందు లీకైన Narzo 70 Pro ధర శ్రేణి
Next articleVivo: గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్టైన Vivo Y18
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.