ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తాజాగా నోట్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Realme Note 60 పేరుతో ఈ ఫోన్ ఇండోనేషియాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 32ఎంపి ప్రైమరీ కెమెరా, 24జిబి ర్యామ్ (8+16), 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 256జిబి స్టోరేజీ, 10 వాట్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. ఓసారి ఈ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం.
Realme Note 60 ధర
Realme Note 60 స్మార్ట్‌పఓన్ యొక్క 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధరను Rp.13,99,000 (సుమారు రూ.7,580) గా పెట్టారు. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను Rp.15,99,000 (సుమారు రూ.8,660) గా పెట్టారు. టాప్ వేరియంట్ 8జిబి + 256జిబి మోడల్ ధరను Rp.19,99,000 (సుమారు రూ.10,830) గా పెట్టారు. ఇండోనేషియాలో ఈ ఫోన్ మార్బుల్ బ్లాక్ మరియు వొయేజర్ బ్లూ కలర్స్ లో లభిస్తుంది.
Realme Note 60 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Realme Note 60 లో 6.74-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 560 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
ప్రాసెసర్: Realme Note 60 స్మార్ట్‌ఫోన్‌లో యూనిఎస్ఓసీ టీ612 ఆక్టా-కోర్ చిప్సెట్ వాడారు. ఇది 12 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వాడారు.
సాఫ్ట్‌వేర్: Realme Note 60 ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
మెమొరీ: Realme Note 60 డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 16జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ అందించారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 24జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. ఇక మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 2టిబి వరకు పెంచుకోవచ్చు.
కెమెరా: Realme Note 60 స్మార్ట్‌ఫోన్ లో 32ఎంపి మెయిన్ కెమెరా అందించారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ, చార్జింగ్: Realme Note 60 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఇతర ఫీచర్లు: Realme Note 60 లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్ 5.0, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్, ఐపీ64 రేటింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఇచ్చారు.
