
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో ఒక కొత్త ఫ్లాగ్షిప్ డివైజ్ లాంచ్ కానుంది. Realme GT Neo 6 SE పేరుతో మార్కెట్ లోకి రానున్న ఈ డివైజ్ ఏప్రిల్ 11న చైనాలో లాంచ్ అవుతోంది. ఇప్పటికే ఈ ఫోన్ కి సంబంధించి చాలా లీక్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. వీటి ద్వారా స్పెసిఫికేషన్స్, డిజైన్ రివీల్ అయ్యాయి. ఇప్పుడు టీజర్ ద్వారా ఎన్నో విషయాలు ఖరారయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.
Realme GT Neo 6 SE లాంచ్ తేదీ ఖరారు
Realme GT Neo 6 SE స్మార్ట్ఫోన్ లాంచ్ తేదీని రియల్మీ సంస్థ మైక్రోబ్లాగింగ్ సైట్ వీబో పై షేర్ చేసింది.
Realme GT Neo 6 SE డివైజ్ ఏప్రిల్ 11వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు చైనాలో లాంచ్ అవుతుంది.

కొత్త టీజర్ ద్వారా సిల్వర్ కలర్ ఆప్షన్ రివీల్ అయ్యింది. ఫోన్ చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంది.
Realme GT Neo 6 SE ఫోన్ 50ఎంపి ప్రైమరీ కెమెరాతో వస్తున్నట్లు అర్థమవుతోంది.
Realme GT Neo 6 SE స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Realme GT Neo 6 SE లో కాస్త కర్వ్డ్ స్క్రీన్ ఉంటుంది. అలాగే 6.78-ఇంచ్ 8టీ ఎల్టీపీవో ప్యానెల్, 1.5కే రెజుల్యూషన్ (2780*1264 పిక్సెల్స్), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.
- ప్రాసెసర్: Realme GT Neo 6 SE డివైజ్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ తో వస్తుందని సమాచారం. ఈ చిప్సెట్ ఇటీవలె లాంచ్ అయ్యింది.
- ర్యామ్, స్టోరేజీ: Realme GT Neo 6 SE లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ లేదా 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుందని అంచనా వేస్తున్నారు.
- కెమెరా: Realme GT Neo 6 SE లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయని ఇప్పటికే ఖరారైంది. అయితే ఇతర సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియలేదు.
- ఓఎస్: Realme GT Neo 6 SE డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.











