
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో ఒక కొత్త సిరీస్ లాంచ్ కాబోతోంది. ఇది పీ-సిరీస్ అనే పేరుతో వస్తోంది. ఈ లైనప్ లో Realme P1 5G, Realme P1 Pro 5G అనే డివైజెస్ లాంచ్ కానున్నాయి. వీటిలో, Realme P1 Pro 5G తాజాగా గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్‌కి సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.
Realme P1 Pro 5G గీక్‌బెంచ్ వివరాలు
Realme P1 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 11న చైనీస్ బెంచ్‌మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.
RMX3844 అనే మోడల్ నంబర్ తో గీక్‌బెంచ్ పై Realme P1 Pro 5G లిస్ట్ అయ్యింది.
గీక్‌బెంచ్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్ ని క్రింద చూడండి.
- ఆక్టా-కోర్ 4 నానోమీటర్ ప్రాసెసర్
- 8జిబి ర్యామ్
- ఆండ్రాయిడ్ 14 ఓఎస్
Realme P1 Pro 5G స్మార్ట్‌ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 929 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2680 పాయింట్లు స్కోర్ చేసింది.
Realme P1 Pro 5G ధర
Realme P1 Pro 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ.20,000 లోపు ఉంటుందని రియల్మీ కంపెనీ తెలిపింది.
అయితే ఇది బేస్ మోడల్ ధరా? లేదా అన్ని వేరియంట్స్ కూడా ఈ ధర లోపే లాంచ్ అవుతాయా అనే విషయం తెలియాల్సి ఉంది.
Realme P1 Pro 5G డివైజ్ ఏప్రిల్ 15న లాంచ్ అవుతోంది. అప్పుడే ధర వివరాలపై స్పష్టత వస్తుంది.
Realme P1 Pro 5G స్పెసిఫికేషన్స్
ప్రాసెసర్: Realme P1 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంటుంది.
సేఫ్టీ: ఫోన్ వేడెక్కకుండా 3డీ వీసీ కూలింగ్ సిస్టమ్ ని ఈ ఫోన్ లో అందిస్తున్నారు.
డిస్ప్లే: Realme P1 Pro 5G లో కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ డిమ్మింగ్ ఉంటాయి.
బ్యాటరీ, చార్జింగ్: Realme P1 Pro 5G 45 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది. బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియలేదు.
భద్రత: Realme P1 Pro 5G ఐపీ65 రేటింగ్ తో వస్తోంది.












