Redmi A2 ధర, స్పెసిఫికేషన్స్, డిజైన్ రెండర్స్; Helio G36 చిప్‌తో వస్తోన్న డివైజ్

Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Redmi A2 స్మార్ట్ ఫోన్
  • 5000ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తోన్న Redmi A2
  • లీక్స్ ప్రకారం Redmi A2 ధర 97 యూరోలు (రూ.8,600)

షావోమి సంస్థ గతేడాది Redmi A1 సిరీస్ ని భారత్ లో లాంచ్ చేసింది. భారత్ తో పాటు కొన్ని ఇతర మార్కెట్స్ లో కూడా ఈ డివైజ్ లాంచైంది. షావోమి వద్ద ఉన్న చవకైన ఫోన్లలో Redmi A1 సిరీస్ ముందు వరుసలో ఉంటుంది. ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ లో ఈ ఫోన్ ఉత్తమమైన ఆప్షన్. ఇక విషయంలోకి వస్తే, షావోమి ప్రస్తుతం Redmi A2 పై పని చేస్తున్నట్లు సమాచారం.

రానున్న కొన్ని వారాల్లో Redmi A2 డివైజ్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈలోపు కొత్త లీక్ ద్వారా Redmi A2 ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.

Redmi A2 డివైజ్ మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్ తో వస్తుందని టిప్‌స్టర్ రోలాండ్ క్వాండ్ట్ తెలిపినట్లు WinFuture తన కథనంలో పేర్కొంది. అలాగే ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానున్నట్లు సమాచారం. Redmi A2 ధర, స్పెసిఫికేషన్స్, డిజైన్ తదితర వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

Redmi A2 ధర, స్పెసిఫికేషన్స్

Redmi A2 స్మార్ట్ ఫోన్ Redmi A1 కి సక్సెసర్ గా వస్తోంది. యూరప్ లో బ్లాక్, బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లాంచైంది. లీకైన వివరాలను బట్టి, Redmi A2 ధర 97 యూరోలు (సుమారు రూ.8,600) గా ఉంది. ఈ ఫోన్ 2జిబి ర్యామ్ + 32జిబి స్టోరేజీ ని కలిగి ఉంటుంది.

Redmi A2 స్మార్ట్ ఫోన్ ప్లాస్టిక్ బ్యాక్ ప్యానెల్, ఫ్రేమ్ తో వస్తోంది. స్క్వైరికల్-షేప్డ్ కెమెరా మాడ్యూల్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. అలాగే ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. ఈ డివైజ్ వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ తో వస్తోంది. బాటమ్ లో మందపాటి చిన్ ఉంటుంది. ఫ్రేమ్ ఫ్లాట్ గా ఉంటుంది. పవర్, వాల్యూమ్ బటన్స్ కుడివైపున ఉంటాయి. ఎడమ వైపున సిమ్ స్లాట్ ఉంటుంది.

Redmi A2 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్ వాడారు. ఇది హీలియో జీ35 చిప్సెట్ కి సక్సెసర్. ఇది 12 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్సెట్. ఈ ఫోన్ లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి మెయిన్ కెమెరా ఉన్నాయి. 32జిబి స్టోరేజీ, 2జిబి ర్యామ్ ని ఈ ఫోన్ లో అందించారు.

Redmi A2 6.52-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్, ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తోంది. ఈ ఫోన్ లో 8ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.