లీకైన Vivo V30 Lite స్పెసిఫికేషన్స్

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo V30 సిరీస్
  • లైనప్‌లో వస్తోన్న Vivo V30, V30 Pro,
  • లైనప్ లో మూడో మోడల్ Vivo V30 Lite

ప్రముఖ టెక్ బ్రాండ్ Vivo త్వరలో V30 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo V30, Vivo V30 Pro, Vivo V30 Lite అనే మోడల్స్ రానున్నాయి. అయితే కంపెనీ నుంచి ఇంకా అధికార ప్రకటన రాలేదు. కానీ, Vivo V30 Lite డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఇంతవరకు Vivo V30 Lite గురించి కూడా కంపెనీ నుంచి ఏ సమాచారం బయటకు రాలేదు. సరే, ఓసారి Vivo V30 Lite లీకైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo V30 Lite స్పెసిఫికేషన్స్ (లీక్)

  • ర్యామ్, స్టోరేజీ: మై స్మార్ట్ ప్రైస్ వెబ్‌సైట్ తన నివేదికలో Vivo V30 Lite స్మార్ట్‌ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో కానుందని తెలిపింది. బేస్ వేరియంట్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. టాప్ వేరియంట్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Vivo V30 Lite లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీకి సంబంధించిన వివరాలు ఇంకా తెలియదు.
  • ఓఎస్: Vivo V30 Lite స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo V30 Lite లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటాయి.
Previous articleకేవలం రూ.9,999 ధరతో లాంచైన Samsung Galaxy A05
Next articleలాంచ్‌కి ముందు రివీలైన Redmi K70 Pro గీక్‌బెంచ్ స్కోర్, స్పెసిఫికేషన్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.