Xiaomi సబ్-బ్రాండ్ Redmi త్వరలో Redmi K70 Ultra అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. చైనాకు ఆవల గ్లోబల్ మార్కెట్స్ లో Xiaomi T-సిరీస్ పేరుతో ఈ డివైజ్ లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ కి సంబంధించిన పలు వివరాలు లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి.
మరో విషయం ఏంటంటే, Redmi K60 Ultra గ్లోబల్ మార్కెట్స్ లో Xiaomi 13T Pro పేరుతో లాంచ్ అయ్యింది. దీంతో Redmi K70 Ultra డివైజ్ Xiaomi 14T Pro పేరుతో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, దీనికి సంబంధించి ఇంకా స్పష్టత లేదు.
Redmi K70 Ultra స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, Redmi K70 Ultra యొక్క స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
- డిస్ప్లే: Redmi K70 Ultra లో 8టీ ఓఎల్ఈడీ ఎల్టీపీవో ప్యానెల్, పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Redmi K70 Ultra లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్సెట్ వాడనున్నారు.
- ర్యామ్, స్టోరేజీ: Redmi K70 Ultra డివైజ్ 24జిబి ఎల్పీడీడీఆర్5టీ ర్యామ్ మరియు 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయని టిప్‌స్టర్ ద్వారా తెలిసాయి. ఎల్పీడీడీఆర్5టీ ర్యామ్ తో రాబోవు తొలి ఫోన్ గా Redmi K70 Ultra అవకాశం ఉంది.
- కెమెరా: Redmi K70 Ultra లో 50ఎంపి సోని ఎల్‌వైటీఐఏ 800 ఓఐఎస్, ఈఐఎస్ ప్రైమరీ కెమెరా, 108ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయని సమాచారం. ఇతర కెమెరా సెన్సర్స్ గురించి ఇంకా వివరాలు తెలియలేదు.
మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్సెట్ విషయానికి వస్తే, రీసెంట్ గా వచ్చిన Vivo X100 మరియు Vivo X100 Pro స్మార్ట్‌ఫోన్లలో ఇదే చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ720 ఇమ్మోర్టాలిస్ ఎంపీ12 జీపీయూ వాడారు.
