Redmi: త్వరలో లాంచ్ కానున్న Redmi A3x

Highlights

  • ఏప్రిల్‌లో Redmi A3x లాంచ్
  • డివైజ్ మోడల్ నంబర్ 24048RN6CI
  • 6.71-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే

Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి ఏ-సిరీస్ లో ఒక చవకైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. Redmi A3x పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తుంది. తాజాగా Redmi A3x లాంచ్ వివరాలు లీక్ అయ్యాయి. Gizmochina వెబ్‌సైట్ ఈ సమాచారాన్ని తన కథనం ద్వారా తెలిపింది. ఏప్రిల్ నెలలోనే భారత్ మరియు గ్లోబల్ మార్కెట్స్ లో Redmi A3x లాంచ్ ఉంటుందని రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.

ఏప్రిల్‌లో Redmi A3x లాంచ్ అయ్యే అవకాశం

Redmi A3x లాంచ్ ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. రిపోర్ట్స్ గనుక నిజమైతే, ఈ డివైజ్ ఏప్రిల్ నెలలోనే లాంచ్ అవ్వనుంది. బేసిక్ యూజర్ల కోసం ఈ ఫోన్ ని తీసుకొస్తున్నారు. రెడ్మీ ఏ2, ఏ3, ఏ3ఎక్స్ ఫోన్లన్నీ కూడా సాధారణ వాడకం కోసం ఉద్దేశించి లాంచ్ అవుతున్నవే. రెడ్మీ ఏ-సిరీస్ హై-పెర్ఫామెన్స్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ కాదు.

రిపోర్ట్ ప్రకారం, Redmi A3x స్మార్ట్‌ఫోన్ 24048RNCG మరియు 24048RN6CI అనే మోడల్ నంబర్లను కలిగి ఉంది. 2404 అంటే ఏప్రిల్ 2024 ని సూచిస్తోంది. అంటే ఏప్రిల్ నెలలో లాంచ్ ఉంటుందని తెలుస్తోంది. ఇక G మరియు I అక్షరాలు గ్లోబల్ మరియు ఇండియన్ మార్కెట్స్ ని సూచిస్తున్నాయి. Redmi A3x లో ఫీచర్లు Redmi A3 లో మాదిరి ఉండవచ్చు. ఓసారి రెడ్మీ ఏ3 స్పెసిఫికేషన్స్ పై కన్నేద్దాం పదండి.

Redmi A3 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Redmi A3 లో 6.71-ఇంచ్ (1650*720) పిక్సెల్స్ హెచ్డీ+ డిస్ప్లే, ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi A3 లో మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్, ఐఎంజీ పవర్‌వీఆర్ జీఈ8320 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi A3 డివైజ్ 3జిబి/4జిబి/6జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 64జిబి/128జిబి ఈఎంఎంసీ 5.1 ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
  • ఓఎస్: Redmi A3 డివైజ్ ఆండ్రాయిడ్ 13 (గో వర్షన్) ఓఎస్ తో లాంచ్ అయ్యింది. ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.
  • కెమెరా: Redmi A3 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • కనెక్టివిటీ: Redmi A3 లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లొనాస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • బ్యాటరీ: Redmi A3 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi A3 లో 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎమ్ ఆడియో, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Previous articleRedmi Turbo 3 లాంచ్ ఖరారు, టీజర్ ఇమేజ్ విడుదల
Next articleitel: ఈఈసీ సర్టిఫికేషన్ పొందిన itel P65+, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.