హైలైట్స్:
- ఫ్యాక్టరీ నుంచి లీకైన శాంసంగ్ గెలాక్సీ ఎ04ఎస్ లైవ్ ఇమేజెస్, రివీల్ అయిన పూర్తి డిజైన్
- ఎస్ఎమ్-ఏ047 మోడల్ నంబర్ ను కలిగిన హ్యాండ్సెట్, కనిపిస్తోన్న ప్లాస్టిక్ బాడీ
- ఎగ్జినోస్ 850 చిప్సెట్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 13ఎంపి ప్రైమరీ కెమెరా, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ స్మార్ట్ ఫోన్ కంపెనీ శాంసంగ్ త్వరలో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఏ04ఎస్ తో వస్తోంది. ఇంకా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీ కన్ఫర్మ్ కాలేదు. శాంసంగ్ ఏ03ఎస్ ఫోన్ కి సక్సెసర్ గా ఏ04ఎస్ వస్తోంది. గ్రేటర్ నొయిడా ఫ్యాక్టరీ లో ఈ ఫోన్ యొక్క ఉత్పత్తి మొదలైనట్లు సమాచారం. ఇప్పుడు, 91మొబైల్స్ హిందీ ఎక్స్ క్లూజివ్ గా ఫ్యాక్టరీ నుంచి వచ్చిన లైవ్ ఇమేజెస్ ని బయటపెట్టింది. ఇప్పుడు ఈ పిక్స్ నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఈ పిక్స్ ద్వారా మనకు ఫోన్ యొక్క ఫుల్ డిజైన్ ఏంటో తెలిసిపోయింది.
శాంసంగ్ ఏ04ఎస్ పూర్తి ప్లాస్టిక్ బాడీతో వస్తోంది. బడ్జెట్ ఫోన్ కాబట్టి, ప్లాస్టిక్ బాడీతో ఉండటం ఊహించదగిన విషయమే. ఇక ఈ ఫోన్ ధరను తగ్గించడానికి ఇందులో ఎగ్జినోస్ చిప్సెట్ ను వాడారు.
Samsung Galaxy A04s డిజైన్
శాంసంగ్ నుంచి వచ్చిన ఎన్నో బడ్జెట్ ఫోన్ మాదిరే గెలాక్సీ ఏ04ఎస్ కూడా ఉంది. సైడ్ ప్యానెల్స్ కాస్త కర్వ్డ్ గా ఉండి క్యాండీ బార్ డిజైన్ ను తలపిస్తోంది. పాలీకార్బొనేట్ బ్యాక్ బాడీపై టెక్చర్డ్ ప్యాటెర్న్ ఉంది. పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ కుడివైపున ఉన్నాయి. ఫోన్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండే అవకాశముంది. ముందువైపున సెల్ఫీ కెమెరా కోసం వాటర్ డ్రాప్ నాచ్ ఉంది. బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరాస్, ఎల్ఈడీ ఫ్లాష్ రెక్ట్యాంగులర్ మాడ్యూల్ లో ఉన్నాయి. అలాగే ఈ ఫోన్లో 3.5ఎంఎం జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, బాటమ్ లో స్పీకర్ గ్రిల్ ఉన్నాయి.
Samsung Galaxy A04s లాంచ్ టైమ్ లైన్
శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్ ఉత్పత్తి తొలి దశలో ఉంది. మరో రెండు నెలల్లో ఫోన్ లాంచ్ అయ్యే అవకాశముంది. లాంచ్ కి ముందు పలు విభిన్న పరీక్షలు జరపాల్సి ఉంటుంది. సెప్టెంబర్ చివరి వారంలో ఫోన్ లాంచ్ అవుతుందని మేం అంచనా వేస్తున్నాం. ఈ ఫోన్ 5జీ వేరియంట్ లో కూడా లభ్యం కానుందని సమాచారం. దేశంలో 5జీ సేవలు లాంచ్ అయ్యాక, ఈ మోడల్ ని లాంచ్ చేస్తే బెటర్. ఎందుకంటే అప్పటికి దేశంలో 5జీ సేవలు రన్ అవుతుంటాయి కాబట్టి, బడ్జెట్ లో వచ్చే 5జీ ఫోన్ కొనాలని చూసే వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. కనీసం ప్రధాన నగరాలకు 5జీ సేవలు విస్తరించాక, ఈ ఫోన్ లాంచ్ అయితే మంచిది.
Samsung Galaxy A04s స్పెసిఫికేషన్స్
శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్ లో ఎగ్జినోస్ 850 చిప్సెట్ ను అమర్చారు. 3జిబి ర్యామ్ వేరియంట్ తో పాటు ఇతర వేరియంట్స్ కూడా ఉండే అవకాశముంది. ఆండ్రాయిడ్ 12, 13ఎంపి మెయిన్ కెమెరా, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్లో ఉంటాయి. 15 వాట్ అడాప్టర్ బాక్స్ లో ప్రొవైడ్ చేసే అవకాశముంది.