హైలైట్స్:
- భారత్ లో గెలాక్సీ ఏ04ఎస్ ఉత్పాదనను మొదలుపెట్టిన శాంసంగ్
- 4జీ మరియు 5జీ వర్షన్స్ లో లాంచ్ కానున్న హ్యాండ్సెట్
- సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్ లాంచ్ అయ్యే అవకాశం
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్, త్వరలోనే గెలాక్సీ ఏ04ఎస్ బడ్జెట్ ఫోన్ ని లాంచ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఫోన్ కి సంబంధించిన వివరాలను ఇదివరకు మేం ప్రచురించడం జరిగింది. తాజాగా తెలియవస్తున్నదేంటంటే, 91మొబైల్స్ హిందీ కథనం ప్రకారం, ఈ ఫోన్ ఉత్పాదన శాంసంగ్ యొక్క నొయిడా ప్లాంట్ లో మొదలైనట్లు సమాచారం. 4జీ, 5జీ వర్షన్స్ లో లభించనున్న ఈ ఫోన్ రాబోవు రెండు నెలల్లో లాంచ్ కానుంది. బహుశా సెప్టెంబర్ చివర్లో లేదా అక్టోబర్ మొదట్లో ఎంట్రీ ఇచ్చే అవకాశముంది. పండుగ సీజన్ కు ముందే లాంచ్ ఉండనుందని అంచనా.
Samsung Galaxy A04s డిజైన్
శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్ డిజైన్ విషయానికి వస్తే, కొన్ని రోజుల క్రితం ఫోన్ యొక్క రెండర్ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. దీంతో మనకు కొంత సమాచారం దొరికినట్లైంది. ఫోన్ వెనకాల మూడు కెమెరాలను అమర్చినట్లు ఇమేజెస్ ద్వారా తెలుస్తోంది. సెల్ఫీ కెమెరా కోసం వాటర్ డ్రాప్ నాచ్ ఉంది. యూఎస్బీ టైప్-సీ కనెక్టర్, 3.5ఎంఎం ఆడియో జాక్, లౌడ్ స్పీకర్ గ్రిల్ బాటమ్ ప్యానెల్ లో ఉన్నాయి. ఇక పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ సైడ్ ప్యానెల్ పై ఉన్నాయి. ఇక పవర్ బటన్, ఫింగర్ ప్రింట్ స్కానర్ లా కూడా పని చేయనుంది.
Samsung Galaxy A04s స్పెసిఫికేషన్స్
ఇప్పటి వరకు మనకు ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ కి సంబంధించి వివరాలు ఏమీ తెలియలేదు. అయితే ఫోన్ పలు సర్టిఫికేషన్స్ సైట్స్ పై కనిపించింది. దీంతో ఆ లిస్టింగ్స్ ఆధారంగా శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్ గురించి కొంత సమాచారం తెలిసింది. ఈ డివైజ్ లో ఎగ్జినోస్ 850 చిప్సెట్ ను అమర్చినట్లు మనకు గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా గతంలోనే స్పష్టమైంది. ఇది కాకుండా, మరో విషయం ఏంటంటే, కనీసం ఒక 3జిబి ర్యామ్ వేరియంట్ వస్తుందని అంచనా. ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. తాజాగా బయటకు వచ్చిన సమాచారాన్ని బట్టి, ఫోన్లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనున్నట్లు సమాచారం.
ఎఫ్సీసీ ఫైలింగ్ అనే యూఎస్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ ద్వారా ఫోన్ యొక్క ఛార్జింగ్ వివరాలు రివీల్ అయ్యాయి. ఎఫ్సీసీ డేటా ఆధారంగా ఫోన్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్ తో వస్తుందని తెలుస్తున్నప్పటికీ, భారత వేరియంట్ మాత్రం బాక్స్ లో 15 వాట్ ఛార్జర్ నే కలిగి ఉండనున్నట్లు సమాచారం. ఎమ్ మరియ ఏ సిరీస్ ఫోన్లకు కూడా ఇదే విధంగా 15 వాట్ ఛార్జర్ వస్తోంది. గెలాక్సీ ఏ04ఎస్ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మాకు తెలియగానే, మిమ్మల్ని అప్డేట్ చేస్తాం. అంతవరకు తాజా టెక్ న్యూస్ కోసం ఫాలో అవ్వండి 91మొబైల్స్ తెలుగు.














