
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Samsung గ్లోబల్ గా A05 సిరీస్ లో రెండు కొత్త ఫోన్లను సెప్టెంబర్ నెలలో లాంచ్ చేసింది. అవి: Samsung Galaxy A05, Samsung Galaxy A05s. ఇప్పటికే Samsung Galaxy A05s డివైజ్ భారత్ లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు Samsung Galaxy A05 కూడా లాంచ్ అయ్యింది. రూ.9,999 ధరతో Samsung Galaxy A05 డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. సరే, ఓసారి Samsung Galaxy A05 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర వివరాలు తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy A05 ధర, లభ్యత
- అయితే విషయం ఏంటంటే, శాంసంగ్ ఇండియా అధికార వెబ్ సైట్ లో Samsung Galaxy A05 డివైజ్ లిస్ట్ కాలేదు. కానీ, క్రోమా స్టోర్స్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది. Samsung Galaxy A05 డివైజ్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- Samsung Galaxy A05 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.9,999 గా ఉంది.
- Samsung Galaxy A05 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,499 గా ఉంది.
- Samsung Galaxy A05 డివైజ్ లైట్ గ్రీన్, సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Samsung Galaxy A05 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Samsung Galaxy A05 లో 6.7-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, 1600*720 పిక్సెట్స్ రెజుల్యూషన్, 16 మిలియన్ కలర్స్ సపోర్ట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy A05 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ఉంది.
- ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A05 డివైజ్ 6జిబి వరకు ర్యామ్ + 128జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంది.
- బ్యాటరీ: Samsung Galaxy A05 లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
- కెమెరా: Samsung Galaxy A05 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- ఓఎస్: Samsung Galaxy A05 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Samsung Galaxy A05 లో డ్యూయల్ సిమ్, 4జీ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్ ఉన్నాయి.











