Samsung Galaxy A05: తక్కువ ధరలో 12GB ర్యామ్ ఫోన్

Highlights

  • భారత్ లో లాంచైన Samsung Galaxy A05
  • 2 మెమొరీ వేరియంట్స్ లో వచ్చిన డివైజ్
  • Samsung Galaxy A05 ప్రారంభ ధర రూ.9,999

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung భారత్ లో Galaxy A05 డివైజ్ ని లాంచ్ చేసింది. రిటైల్ ప్లాట్ఫామ్ క్రోమా పై Samsung Galaxy A05 కి సంబంధించిన వివరాలు రివీల్ అయ్యాయి. Samsung Galaxy A05 డివైజ్ 6.7-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 50ఎంపి మెయిన్ కెమెరా, మీడియాటెక్ జీ85 చిప్సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. సరే, ఓసారి Samsung Galaxy A05 పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A05 ధర, లభ్యత, కలర్స్

  • Samsung Galaxy A05 డివైజ్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.9,999 గా నిర్ణయించారు.
  • Samsung Galaxy A05 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర భారత్ లో రూ.12,499 గా ఉంది.
  • రీసెంట్ గా Samsung Galaxy A05 డివైజ్ శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ మరియు రిటైల్ స్టోర్స్, అఫీషియల్ వెబ్ సైట్, ఇతర ప్లాట్ఫామ్స్ పై ప్రవేశించింది.
  • స్పెషల్ ఆఫర్ లో భాగంగా, Samsung Galaxy A05 ని కస్టమర్లు శాంసంగ్ ఫైనాన్స్+ నో-కాస్ట్ ఈఎంఐ ద్వారా లేదా ఇతర ఎన్బీఎఫ్‌సీల ఈఎంఐ ఆప్షన్స్ ద్వారా నెలకి కేవలం రూ.875 చెల్లించి కొనుగోలు చేయవచ్చు.
  • ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ పై పరిమిత కాలం పాటు రూ.1,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ అమలులో ఉంటుంది.
  • Samsung Galaxy A05 3 కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి బ్లాక్, సిల్వర్ మరియు లైట్ గ్రీన్.

Samsung Galaxy A05 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy A05 లో 6.7-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, 1600*720 పిక్సెట్స్ రెజుల్యూషన్, 16 మిలియన్ కలర్స్ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A05 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A05 డివైజ్ 6జిబి వరకు ర్యామ్ + 128జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A05 లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • కెమెరా: Samsung Galaxy A05 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • ఓఎస్: Samsung Galaxy A05 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A05 లో డ్యూయల్ సిమ్, 4జీ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్ ఉన్నాయి.