
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Vivo చైనాలో Vivo Y100i 5G డివైజ్ ని లాంచ్ చేసింది. 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తక్కువ ధరలోనే వినియోగదారులకు ఈ ఫోన్ లభించనుంది. నేటి నుంచి ఈ ఫోన్ సేల్ చైనాలో మొదలైంది. Vivo Y100i 5G లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉన్నాయి. సరే, ఓసారి Vivo Y100i 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
Vivo Y100i 5G ధర, లభ్యత
- Vivo Y100i 5G స్మార్ట్ఫోన్ 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ సింగిల్ ఆప్షన్ లో లాంచ్ అయ్యింది.
- Vivo Y100i 5G ధరను RMB 1,599 (సుమారు రూ.18,800) గా నిర్ణయించారు.
- Vivo Y100i 5G డివైజ్ బ్లాక్, స్కై బ్లూ మరియు పింక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- Vivo Y100i 5G స్మార్ట్ఫోన్ జేడీ.కామ్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంది. రిటైల్ ఔట్లెట్స్, ఆఫ్లైన్ మార్కెట్స్ లో డిసెంబర్ 2 నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Vivo Y100i 5G స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Vivo Y100i 5G లో 6.64-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 93.3 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో ఉన్నాయి.
- ప్రాసెసర్: Vivo Y100i 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, అడ్రెనో 619 జీపీయూ వినియోగించారు.
- ర్యామ్, స్టోరేజీ: Vivo Y100i 5G లో 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ ఉన్నాయి. 12జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ తో యూజర్ కి మొత్తం 24జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
- కెమెరా: Vivo Y100i 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Vivo Y100i 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Vivo Y100i 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, ఐపీ54 రేటింగ్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.











