50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో లాంచైన Samsung Galaxy A05s 4GB ర్యామ్ వేరియంట్

Highlights

  • అక్టోబర్ లో భారత్‌లో లాంచైన Samsung Galaxy A05s
  • 6జిబి ర్యామ్ తో వచ్చిన Samsung Galaxy A05s
  • తాజాగా 4జిబి వేరియంట్‌ని తీసుకొచ్చిన శాంసంగ్

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung అక్టోబర్ నెలలో భారత్ లో Samsung Galaxy A05s స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. రూ.14,999 ధరతో ఈ ఫోన్ సేల్ కి వచ్చింది. నేడు, కంపెనీ 4జిబి వేరియంట్ ని భారతీయ మార్కెట్ లోకి తీసుకొచ్చింది. Samsung Galaxy A05s డివైజ్‌ని లో-బడ్జెట్ సెగ్మెంట్ కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చారు. ఇప్పుడు Samsung Galaxy A05s డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్ వేరియంట్స్ లో యూజర్స్ కి అందుబాటులో ఉంటుంది. సరే, ఓసారి Samsung Galaxy A05s యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy A05s ధర

Samsung Galaxy A05s డివైజ్ 6జిబి ర్యామ్ మోడల్ రూ.14,999 ధరతో లాంచ్ అయ్యింది. నవంబర్ 7 వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ కి అందుబాటులోకి వచ్చింది. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ధరను రూ.13,499 గా నిర్ణయించారు. Samsung Galaxy A05s డివైజ్ లైట్ వయొలెట్, లైట్ గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అన్ని ఈ-కామర్స్ సైట్స్, రిటైల్ స్టోర్స్, కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy A05s 4GB స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy A05s లో 6.7-ఇంచ్ పీఎల్ఎస్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ (1080*2400 పిక్సెల్స్) రెజుల్యూషన్, ఇన్ఫినిటీ-యు నాచ్ డిజైన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A05s లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 610 జీపీయూ వినియోగించారు.
  • మెమొరీ: Samsung Galaxy A05s డివైజ్ 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 4జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీతో వచ్చింది. ఈ ఫోన్ లో మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ కూడా ఉంది.
  • సాఫ్ట్‌వేర్: Samsung Galaxy A05s డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14, 15 అప్‌గ్రేడ్స్ తో పాటు 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ని పొందుతుంది.
  • కెమెరా: Samsung Galaxy A05s లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ కెమెరా ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy A05s డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఇవ్వబడింది.
  • సెక్యూరిటీ: Samsung Galaxy A05s స్మార్ట్‌ఫోన్ లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ అందించారు.
  • చుట్టుకొలత, బరువు: Samsung Galaxy A05s డివైజ్ 168.0 మి.మీ పొడవు, 77.8 మి.మీ వెడల్పు, 8.8 మి.మీ మందం, 194 గ్రాముల బరువు ఉంటుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A05s లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, యూఎస్బీ 2.0, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • ఆడియో: Samsung Galaxy A05s లో 3.5ఎంఎం ఆడియో జాక్, డాల్బీ అట్మాస్ అందించారు.
  • కలర్ ఆప్షన్స్: Samsung Galaxy A05s డివైజ్ లైట్ గ్రీన్, లైట్ వయొలెట్, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Previous article6.64-ఇంచ్ 90Hz డిస్ప్లేతో ఇండోనేషియాలో లాంచైన Vivo Y27s
Next articleFCC సర్టిఫికేషన్ సైట్‌పై లిస్టైన POCO M6 Pro 4G, Redmi Note 13 Pro 4G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.