6.64-ఇంచ్ 90Hz డిస్ప్లేతో ఇండోనేషియాలో లాంచైన Vivo Y27s

Highlights

  • 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో వచ్చిన Vivo Y27s
  • Vivo Y27s ప్రారంభ ధర IDR 23,99,000
  • కలర్ ఆప్షన్స్: బర్గండీ బ్లాక్, గార్డెన్ గ్రీన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo సంస్థ నేడు ఇండోనేషియాలో Vivo Y27s డివైజ్ ని లాంచ్ చేసింది. Vivo Y27, Vivo Y27 5G లతో పోల్చితే Vivo Y27s లో స్పెసిఫికేషన్స్ వేరుగా ఉన్నాయి. Vivo Y27s ఫోన్ 6.64-ఇంచ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, ఆక్టా-కోర్ ప్రాసెసర్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, ఐపీ54 రేటింగ్, డ్యూయల్ కెమెరా సెటప్ ఉన్నాయి. సరే, ఓసారి Vivo Y27s ధర, లభ్యత, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo Y27s ధర, లభ్యత

  • Vivo Y27s డివైజ్ బర్గండీ బ్లాక్ మరియు గార్డెన్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Vivo Y27s 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ మోడల్ ధర IDR 23,99,000 (సుమారు రూ.12,800) గా ఉంది.
  • 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర IDR 27,99,000 (సుమారు రూ.14,900) గా ఉంది.

Vivo Y27s స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo Y27s లో 6.64-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, 650 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y27s లో స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 610 జీపీయూ వినియోగించారు.
  • మెమొరీ: Vivo Y27s డివైజ్ లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి.
  • సాఫ్ట్‌వేర్: Vivo Y27s డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Vivo Y27s లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Vivo Y27s లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo Y27s లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, బైడూ, గ్లొనాస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, ఓటీజీ సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • చుట్టుకొలత, బరువు: Vivo Y27s డివైజ్ 164.06 మి.మీ పొడవు, 76.17 మి.మీ వెడల్పు, 8.17 మి.మీ మందం, 192 గ్రాముల బరువు ఉంటుంది.
Previous articleSnapdragon 8 Gen 3 చిప్‌తో చైనాలో లాంచైన iQOO 12 సిరీస్
Next article50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో లాంచైన Samsung Galaxy A05s 4GB ర్యామ్ వేరియంట్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.