ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Samsung గతేడాది డిసెంబర్ లో Galaxy A15 5G ని లాంచ్ చేసింది. లాంచ్ సమయంలో 8జిబి+128జిబి మరియు 8జిబి+256జిబి వేరియంట్స్ మార్కెట్ లోకి వచ్చాయి. తాజాగా శాంసంగ్ సంస్థ కొత్త వేరియంట్ ని లాంచ్ చేసింది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ప్రస్తుతం యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. సరే, ఓసారి ఈ కొత్త వేరియంట్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy A15 5G ధర, లభ్యత
- Samsung Galaxy A15 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ కొత్త వేరియంట్ ధరను రూ.17,999 గా నిర్ణయించారు.
- Samsung Galaxy A15 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.19,499 గా ఉంది.
- Samsung Galaxy A15 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.22,499 గా ఉంది.
- Samsung Galaxy A15 5G స్మార్ట్ఫోన్ కొనుగోలుపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ హోల్డర్స్ కి రూ.1,500 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
- Samsung Galaxy A15 5G డివైజ్ శాంసంగ్ ఇండియా ఈ-స్టోర్, అమెజాన్ ఇండియా, ఫ్లిప్కార్ట్ మరియు లీడింగ్ రిటైల్ స్టోర్స్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.
- ఈ-కామర్స్ వెబ్సైట్స్ Samsung Galaxy A15 5G కొనుగోలుపై వివిధ రకాల డిస్కౌంట్స్ని ఆఫర్ చేస్తున్నాయి.
Samsung Galaxy A15 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Samsung Galaxy A15 5G లో 6.5-ఇంచ్ ఫుల్హెచ్డీ+ ఇన్ఫినిటీ యు నాచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy A15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A15 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
- కెమెరా: Samsung Galaxy A15 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
- ఓఎస్: Samsung Galaxy A15 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- బ్యాటరీ: Samsung Galaxy A15 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Samsung Galaxy A15 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
